థైరాయిడ్‌కు శాశ్వత పరిష్కారం..


Tue,September 19, 2017 01:39 AM

థైరాయిడ్ గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఇది ఒక అంతఃస్రావ గ్రంథి. టీ3, టీ4, టీఎస్‌హెచ్ కాల్సిటోనిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని జీవ రసాయన క్రియలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా జీవరసాయన క్రియల్లో కేలరీల వినియోగరేటును, గుండె వేగాన్ని నియంత్రిస్తుంది.
thyroid

థైరాయిడ్ హార్మోన్ల పరిమాణం

- టీ3 (ట్రై అయడో థెరోనిన్) 80-180ఎంజీ/డీఎల్
- టీ4 (థైరాక్సిన్) 4.5 - 12.5 ఎంజీ/డీఎల్
- టీఎస్‌హెచ్ (థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) 0.5 -5.5 ఎంఐయూ/ఎల్

థైరాయిడ్ సమస్య రకాలు

- హైపోథైరాయిడిజం - ఈ సమస్యలో థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో టీ3, టీ4 హార్మోన్ల ఉత్పత్తి తగినంత ఉండదు.

కారణాలు

- హషిమోటోస్ థైరాయిడైటిస్ - ఇది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. రక్షణ వ్యవస్థ థైరాయిడ్ గ్రంథి పై దాడి చేస్తుంది. ఫలితంగా థైరాయిడ్ గ్రంథి (గాయిటర్) పరిమాణం పెరిగిపోయి పనిచెయ్యడం మానేస్తుంది.

- సబ్ ఎక్యూట్ థైరాయిడైటిస్ - ఇది సాధారణంగా థైరాయిడ్ గ్రంథి ఇన్‌ఫ్లమేషన్ వల్ల లేదా గర్భవతులుగా ఉన్నపుడు ఈ సమస్య మొదలవుతుంది. ఇది స్వల్పకాలమే. థైరాయిడ్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

- లక్షణాలు - నీరసం, చలి తట్టుకోలేకపోవడం, మలబద్దకం, కండరాల నొప్పులు, బరువు పెరుగడం లేక తగ్గకపోవడం, ఆకలి లేకపోవడం, గాయిటర్, పొడిబారిన చర్మం, జుట్టు బిరుసుగా మారడం, రాలిపోవడం, కళ్లు, ముఖంలో వాపు, బొంగురు గొంతు, నెలసరి సమస్యలు, డిప్రెషన్, మతిమరుపు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగడం.

హైపర్ థైరాయిడిజం

- లక్షణాలు - మానసిక ఆందోళన, చిరాకు, గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం, వేడి తట్టుకోలేకపోవడం, చెమటలు ఎక్కువగా రావడం, వణుకు, బరువు తగ్గడం లేదా పెరుగడం, ఆకలి పెరుగడం, విరేచనాలు, కాలి కింద భాగంలో వాపు, ఆకస్మికంగా పక్షవాతం రావడం, ఊపిరి అందకపోవడం, నెలసరి సమస్యలు, సంతాన సంబంధ సమస్యలు, నిద్రపట్టకపోవడం, దృష్టి సమస్యలు, నీరసం, థైరాయిడ్ గ్రంథి వాపు.

reddy

హోమియో చికిత్స

హోమియోపతి వైద్య విధానంలో కేవలం లక్షణాలు తగ్గించే చికిత్స కాకుండా శారీరక, మానసిక లక్షణాలు, కుటుంబ చరిత్ర వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తాం. దీంతో తాత్కాలిక ఉపశమనం కాకుండా వ్యాధిని పూర్తిగా నయం చేస్తుంది. కాబట్టి మంచి హోమియోపతి నిపుణులచేత వైద్యం చేయించుకుంటే శాశ్వత పరిష్కారం పొందవచ్చు.

412
Tags

More News

VIRAL NEWS