త్వరలో కమోడిటీ డెరివేటివ్స్‌లోకి మ్యూచువల్ ఫండ్లుC


Sat,July 21, 2018 01:32 AM

mutualfunds
కమోడీటీ డెరివేటివ్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ మదుపు చేయడానికి త్వరలో సెబీ మార్గదర్శకాలను రూపొందించనుంది. కమోడిటీ విభాగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర కమోడిటీలకు వేర్‌హౌజింగ్ నిబంధనలను రూపొందించనుంది. ఎక్స్ఛేంజీలలో వీటికి ఆదరణ పెరిగిన తర్వాత ఇండెక్స్‌లను కూడా ప్రవేశపెట్టాలన్న యోచనలో ఉంది. కమోడిటీ మార్కెట్ లో ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరిగినప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని సెబీ కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ నియంత్రణ విభాగం అధిపతి పికె బిందిష్ తెలిపారు. మార్కెట్‌లో పాల్గొనేవారి సంఖ్య పెరిగితే లిక్విడిటీ పెరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

92
Tags

More News

VIRAL NEWS