తొలి జాతీయ పురస్కారం!


Mon,August 6, 2018 11:28 PM

కుసల రాజేంద్రన్.. ఈ పేరు మనకు పరిచయం లేకపోవచ్చు. కానీ ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సెసిమాలజిస్ట్‌గా ఎన్నో అధ్యయనాలు చేసిన శాస్త్రవేత్త ఈమె.
kusala
సంప్రదాయ కుటుంబంలో పుట్టింది. వారి కుటుంబంలో డిగ్రీ చదివించడమే ఎక్కువ అనుకుంటారు. కానీ పట్టుదలతో అందరినీ ఒప్పించి మరీ భూఅధ్యయన శాస్ర్తాన్ని ఎంచుకున్నది. రూర్కేలో భౌతికశాస్త్రం మీద మాస్టర్స్ చేసింది. ఆ కోర్సులో కుసలతో పాటు ఆరుగురు మాత్రమే ఉండేవారు. అందులో కుసల ఒక్కతే ఆడపిల్ల. తనకి ఎలాంటి సందేహాలు వచ్చినా ఎవరినీ అడుగలేకపోయేది. మహిళలు ఎక్కువ మంది ఉంటే బాగుండు అనుకొంటూ ఉండేది. 1987లో యూఎస్ వెళ్లి భూకంప శాస్త్రంలో పీహెచ్‌డీ చేసి తిరిగి ఇండియాకి 1993లో వచ్చింది. భూగోళశాస్త్రం మీద కొన్ని రోజులు పని చేసింది. తరువాత ఇండియన్ ఇనిస్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేసింది. కొన్నిరోజుల తరువాత రాజేంద్రన్‌తో వివాహం అయింది. భర్త సహకారంతో 1993లో ఏర్పడిన అతి భయంకరమైన కిల్లారి, చమోలి, భుజ్ భూకంపాలను ముందుగానే కనుగొని ప్రపంచానికి తెలియచేసింది. దానివల్ల ఎంతో ప్రాణనష్టం జరుగకుండా కాపాడడంలో కుసల సక్సెస్ అయింది.

అయితే ఈ కనిపెట్టడం వెనుక కుసల పెద్ద ప్రయోగమే చేసింది. ముందుగా గోడల మీద పరిశోధన చేసింది. అక్కడ మట్టి పొరలు ఒకదానిపై ఒకటి ఆధారపడుతాయి. ఈ పొరల వల్ల భూకంప అవాంతరాలు ఏర్పడుతాయి. ఆ ప్రాంతంలో ఉన్న భూకంపాలను అంచనా వేయడానికి టెక్నాలజీతో సులభంగా కనుగొనేలా చేసింది కుసల. దీన్ని బట్టి భూప్రకంపనాల నుంచి బయటపడవచ్చని చెప్పింది. దీనికిగాను మొదటి జాతీయ పురస్కారం అమెను వరించింది. ఇలా అవార్డు అందుకున్న మొదటి మహిళా శాస్త్రవేత్తగా రికార్డు సాధించింది. ఈ అవార్డును మహిళా శాస్త్రవేత్తలకు అంకితం చేశారు.

344
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles