తూర్పు సింధూరం


Sun,January 25, 2015 01:29 AM

ఇల్లు వదిలిపోయేటప్పుడు అన్నం గిట్ల ఉంటె అండ్ల విషం కలిపి పెట్టిపోవాలె అని చెప్పేది ప్రియంవద.

సాయుధ పోరాటంలో ఆయుధం పట్టింది.. ఆజ్ఞల్ని ధిక్కరించి పుస్తకమూ పట్టింది..ప్రజా క్షేమమే ధ్యేయమని కుటుంబ జీవితాన్ని త్యాగం చేసింది.. రజాకార్ల ఆగడాలను ఎదురిస్తూ మహిళా సంఘాలు పెట్టింది..గ్రామీణ మహిళలకు ప్రియక్కగా పేరొందింది.. ఉద్ధండులతో ఉద్యమంలో పాల్గొని మహిళా శక్తిని చాటింది..తూర్పుగూడెంలో పుట్టి, పడమటి రాజ్యాన పోరాట జెండా మోసింది... తూరుపుదిక్కున పొైద్దె పొడిచింది తెలంగాణ సాయుధ పోరాటంలో దివిటీలా వెలిగిన ధీరవనిత... దాయంప్రియం వద ఈ వారం మన వీరనారి.

tty4


నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తిలో పుట్టింది ప్రియంవద. తండ్రి రామకృష్ణారెడ్డి, తల్లి లక్ష్మమ్మ. అన్నయ్య దాయం అప్పటికే ఉద్యమంలో ఉన్నారు. ప్రియం వదది మధ్య తరగతి వ్యవసాయ నాడు అమ్మాయిలకు విద్య అంతంత మాత్రమే అయినా తరగతి వరకు చదువుకుంది. కూడా నేర్చుకుంది. రష్యన్ సాహిత్యం, గోర్కి నవలలు ఆ రోజుల్లోనే చదివేసింది. రెండో ప్రపంచ యుద్ధం గురించి వెలువడిన పుస్తకాల పట్ల ఆసక్తి చూపడం వల్ల నాటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది.

ప్రియం వద వాళ్ల వదిన శశిరేఖ అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి. ఉద్యమంలో పేరొందిన నాయకుడాయన. అన్న, వదినలతో పాటు భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు వెళ్లింది ప్రియం వద. అలా పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావితమైంది. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమబాట పట్టింది.

అన్నయ్యకు ఆసరాగా..


ఆంధ్రమహాసభలు వరంగల్, ఖమ్మంలో జరిగిన తర్వాత అన్నయ్యను భువనగిరి ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా నియమించారు. ఇబ్బందుల్లో ఉన్న అన్నయ్యకు ఆసరా అయ్యేందుకు ప్రియంవద కొలనుపాక జైన మందిరంలో నడిపే స్కూలులో టీచర్‌గా చేరింది. ఆమె తెచ్చే యాభై రూపాయలే అన్న కుటుంబానికి ఆధారమయ్యాయి. అక్కడొక సంవత్సరం పనిచేసింది. కుటుంబసభ్యులంతా ఉద్యమంలో చురుగ్గా వల్ల వారిపై ప్రభుత్వం నిర్భంధం విధించింది. విజయవాడకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే విజయవాడలో జరిగిన అఖిల భారత రైతు మహాసభలో పాల్గొంది. ఆ తర్వాత ఊళ్లలోకి వెళ్లి తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరుగుతున్నదో ఆడవాళ్లకు వారిలో చైతన్యం కలిగించడమూ మొదలు పెట్టింది. రోజులు పోయి మంచిగ బతికే రోజులు రావాలని, అందుకు పార్టీ ఎట్ల కృషి చేస్తున్నదో జనానికి బాగా చెప్పేది.

ఉద్యమ పాఠాలు చెప్పిన తీరు


సూర్యాపేటలో భక్తవత్సలాపురం, అనాసపురం, దురాసపల్లి, రాయపాడు గ్రామాలల్ల తిరిగేది ప్రియంవద. ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలె ? స్త్రీలకు స్థావరాలు కొన్ని తెలిసున్నా చెప్పకుండా ఎట్లుండాలె? కారం అదీ చల్లటానికి ఎట్ల సిద్ధమయ్యా చెప్పేది. ఇల్లు వదిలిపోయేటప్పుడు అన్నం గిట్ల ఉంటె అండ్ల విషం కలిపి పెట్టిపోవాలె అని చెప్పేది. రజాకార్లకు సొమ్ములు లాక్కెళ్ళడంతో పాటు తిండి సమస్య కూడా ఉండేది. అది కుమ్మరించుకుని తినేది. మామూలుగా సమాజంలో స్త్రీలకుండే ఇబ్బందులు వాటినెదుర్కోవాలంటే ఏం చెయ్యాలె ? స్త్రీలను ముందుకెట్లా తీసుకురావాలి అన్న విషయాలు ఎంతో ఉత్తేజంతో ప్రసంగించేది. చదువు విషయంలో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు పాఠాలు చెప్పేది. వీధివీధికి గ్రూపు మీటింగులు పెట్టేది. సూర్యాపేటలో ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత హుజూర్‌నగర్‌లో మరికొంత కాలం పనిచేసింది.


ఐదారు మాసాలకు ప్రియంవద అన్నయ్యకు పాప పుట్టింది. అప్పుడు ఊళ్ళల్ల రజాకార్ల ఒత్తిడి ఎక్కువగా ఉండేది. సొంత ఊళ్ళె వుండే పరిస్థితి లేకుండా పోయింది. కూడా రహస్యంగానే వీరితోపాటు ఉండాల్సి వచ్చింది. వీరి జాడ చెప్పమని ఆమె తండ్రిని పోలీసులు బాగా వత్తిడి చేసి కొట్టిన్రు. నీ కొడుకెక్కుడుండు, నీ బిడ్డెక్కడున్నది? ఆయన దెబ్బలకు తట్టుకుని నిలబడడ్డడే గానీ ఆచూకీ చెప్పలేదు. వాళ్ళెన్నడయితే పార్టీలకు పోయిండ్రో ఆనాడే నాకు కొడుకు, బిడ్డ కాదనుకున్న అని చెప్పిండు. విపరీతంగా దెబ్బలు తిన్నడు. తర్వాత చాలా రోజులకు. అమ్మను, నాన్నను చూసేందుకు ఊరొచ్చింది ప్రియంవద. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి పదకొండు గంటలకు వచ్చి చేసి స్టేషనుకు తీసుకుపోయిన్రు. రోజులు తుంగతుర్తి క్యాంపుల ఉంచిన సూర్యాపేటకు తీసుకుపోయిండ్రు. ఒక్కరోజుంచి హైదరాబాద్ తీసుకపోయిండ్రు. అలా ఆమెను చంచల్‌గూడ జైల్ల మూడు తర్వాత బయటికి వచ్చింది.

అమ్మానాన్నల్ని చూస్తే అరెస్టు...


ఆ తర్వాత కూడా ప్రియంవద తన ఉద్యమ పథాన్ని ఆపలేదు. ఆయుధాలు పట్టి కాల్చడం కూడా నేర్చుకుంది. కాకపోతే దళంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. పరోక్షంగా మాత్రమే సహాయం అందిస్తూ ఉండేది. తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసినప్పుడు గుట్ట మీద సెంట్రీగా పనిచేసింది. అందుకు ఆమె కోసం పోలీసులు వెతికారు. నిర్భంధం పెంచిండ్రు. అలా ఆమె యూనియన్ సైన్యం చేతిలో రెండోసారి అరెస్టయింది. అప్పుడు కూడా సొంతింట్లనే. ఈసారి ఆమెను సికింద్రాబాద్ కంటోన్మెంట్ జైలుకు తీస్కపోయిండ్రు. ఆ వరంగల్ జైలుకు పంపిండ్రు. రెండేళ్ల తర్వాత బయిటికొచ్చింది.


పోరాటం కొనసాగిస్తున్నప్పుడే ప్రియం వద పార్టీకి చెందిన ఒకాయనను వివాహం చేసుకుందామనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయినా ఆమె ఎందుకిలా జరిగిందని విచారించలేదు. మరో వివాహమూ చేసుకోలేదు. ఒంటరిగానే బతికింది. ఉద్యమంతో ఎందరో ఆడవాళ్ల జీవితాల్లో నింపిన ప్రియం వద.. జీవితంలో వెలుగు లేకుండా పోయింది. ఉద్యమరోజుల్లో ప్రజలకు అత్యంత దగ్గరగా గడిపిన ఆమె చివరి రోజుల్లో ప్రజా జీవితానికి దూరంగా జీవిస్తూ ఆగస్టు 3, 2013న తుది శ్వాస విడిచారు.
ఇప్పుడు ఆమె లేదు. కానీ ఆమె చరిత్ర ఉంది. మనకు తెలిసిన చరిత్రలో ఆమె ఒక వీర వనిత. స్ఫూర్తిదాత. జీవితాన్ని ఉద్యమంగా చేసుకున్న ఈ వీరనారికి వందనం, అభివందనం.

1112
Tags

More News

VIRAL NEWS