తుమ్ములు తగ్గించే ఆర్సెనికమ్


Tue,January 23, 2018 10:55 PM

నా వయసు 28 సంవత్సరాలు. గత 5-6 సంవత్సరాల నుంచి ఉదయం నిద్ర లేవగానే 10-15 తుమ్ములు వస్తున్నాయి. ఆగకుండా పల్చటి నీళ్ల మాదిరిగా ముక్కు కారుతుంది. ముక్కు, కళ్లు చెవులు మంట, దురదగా ఉంటున్నాయి. ఏ మాత్రం దుమ్ములో తిరిగినా, బూజు దులిపినా, చల్లనివి తీసుకున్నా తుమ్ములతో ఒకటి రెండ్రోజులు ఇబ్బంది పడుతున్నాను. నెలలో రెండు మూడు సార్లు ఇలా వస్తున్నాయి. జలుబు మాత్రలు వేసుకుంటే తాత్కాలికంగా తగ్గి మళ్లీమళ్లీ వస్తున్నది. హోమియోపతిలో మంచి ఔషధాలు ఉన్నాయని విన్నాను. నా సమస్యకు మంచి పరిష్కారం చూపగలరు.
- నీరజ, జనగామ

cold
మీ లక్షణాలు అలర్జిక్ రైనైటిస్‌గా అనిపిస్తున్నాయి. శరీరంలోని నిరోధక వ్యవస్థ గతి తప్పి మన శరీరానికే శత్రువుగా మారడంతో దీన్ని గుర్తించవచ్చు. శ్వాస ప్రక్రియలో ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం. ఏదైనా దుమ్ము గాలితో పాటు పొరపాటున పీలిస్తే దానిని ముక్కులోని వెంట్రుకలు అడ్డుకుంటాయి. ధూళి కణాలను ముక్కులో ఊరే స్రావాలు కడిగేస్తాయి. ఇదంతా నాణానికి ఒక వైపు. అదే రక్షణ వ్యవస్థ గతి తప్పిందనుకోండి చిన్న రేణువుకు కూడా విపరీతంగా స్పందించి వ్యక్తిని నీరసించే స్థితికి తీసుకురావటమే అలర్జీగా చెప్పవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను ఆధారంగా చూసినపుడు అర్సెనికమ్ ఆల్బమ్ 30 పొటెన్సీలో వారానికి రెండు డోసుల చొప్పున నాలుగు వారాలు వేసుకుంటే మంచి గుణం కనబడుతుంది. దుమ్ము, ధూళి, చల్లగాలి, చల్లటి పదార్థాలకు వీలయినంత దూరంగా ఉండటం మంచిది. ముక్కుకు గుడ్డ కట్టుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.
dr-shiva-shankar

265
Tags

More News

VIRAL NEWS