తామేం తక్కువ కాదు.. వారికేం పోటీ లేదు


Tue,July 31, 2018 11:24 PM

అది పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరం. ఓ హోటల్‌లో నుంచి భారీగా చప్పట్లు వినిపిస్తున్నాయి. తళతళ మెరుస్తున్న వెలుగుల మధ్య ఓ ఫ్యాషన్ షో నడుస్తున్నది. దానికో ప్రత్యేకత ఉన్నది. అదేంటి? ఎందుకు?
The-fashion-show
నారాయణ సేవ సంస్థాన్ జైపూర్, రాజస్థాన్ సంస్థలు సంయుక్తంగా కలిసి దివ్యాంగులకు ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. సామాజిక సేవా కార్యక్రమాలు చేసే ఈ సంస్థలు ప్రతిభ ఉండి వైకల్యంతో బాధపడుతున్న వారిని వెలికి తీసి వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. వీల్ చైర్‌ల మీద, సపోర్ట్ స్టాండ్‌లతో నడుచుకుంటూ వచ్చిన మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టంట్‌లు చేసి తామేం తక్కువ కాదని నిరూపించారు. కలర్‌ఫుల్ డ్రెస్సులు ధరించి నృత్యాలు చేశారు. ఈ పోటీల ద్వారా వివిధ రంగాల్లో రాణించాలనుకుంటున్న దివ్యాంగులకు ఆ రంగంలో కావాల్సిన ఏర్పాట్లను చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీసిన వాళ్లవుతారని నారాయణ సంస్థ భావిస్తున్నది. ప్రతిభ ఉండి కూడా ఆర్థికంగా భారమవుతున్న ఎంతోమంది కళాకారులు మరుగున పడి ఉన్నారని, కళను, కళాకారులను ఆదుకోవడం వల్ల రాబోయే భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు.

351
Tags

More News

VIRAL NEWS