తల్లిపాలు దానం చేయండి!


Fri,August 17, 2018 01:34 AM

తల్లిపాల వారోత్సవాలు ఇటీవలే జరుపుకొన్నాం కదా. మరి ఈ కార్యక్రమం ద్వారానైనా అమ్మపాల విలువ ఏంటో తెలుసుకున్నారా? ఇలా ఏదో ఒకరోజు మాత్రమే అమ్మపాల గురించి మాట్లాడుకోవడం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలి అంటున్నది అమృతా సమంత్.
Amrita
చెన్నైకి చెందిన అమృత ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. చెన్నై, బెంగళూరు, సింగపూర్ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ నాలుగేళ్లుగా సజీవ చిత్రాలను తన కెమెరాలో బంధించింది. నవీన జీవన విధానానికి అలవాటు పడి బిడ్డలకు పాలు ఇవ్వని తల్లులను.. ఒకవేళ ఇద్దామన్నా తీరికలేని వాళ్లను చాలామందిని చూసింది. కొందరు బిడ్డ ఏడుస్తున్నా ఊరుకోబెడుతారు కానీ.. పబ్లిక్‌లో పాలు ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా బాధపడేది. ఒకసారి ఇంగ్లండ్‌లో ఉంటున్న తన స్నేహితురాలితో ఈ విషయాన్ని పంచుకున్నది. ఇంగ్లాండ్‌లో మిల్క్‌బ్యాంక్‌ల గురించి.. మహిళలు స్వచ్ఛందంగా తల్లిపాలు దానం చేయడం గురించి వివరించింది. తర్వాత అమృత చెన్నైలో ఏమైనా బ్రెస్ట్‌మిల్క్ బ్యాంక్‌లు ఉన్నాయా అని వెతకగా.. ఏడు కేంద్రాలు ఉన్నట్లు తెలిసింది. మిల్క్ బ్యాంక్ నిర్వహకులను సంప్రదించి ఈ అంశంపై తాను ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపింది. 2018 ఫిబ్రవరిలో ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాను తీసిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ తల్లుల్లో అవగాహన కల్పిస్తున్నది. తల్లిపాల వారోత్సవాలు ఉన్నాయని అప్పుడు మాత్రమే ఈ అంశం గురించి మాట్లాడటం కాదు.. నిరంతరం ఈ విషయంపై అవగాహన తేవాలన్నదే తన ఉద్దేశం అని చెప్తూ ఎందరో తల్లుల చేత బ్రెస్ట్‌మిల్క్ డొనేట్ చేయిస్తున్నది.

403
Tags

More News

VIRAL NEWS

Featured Articles