తండ్రి కోసం బావిని తవ్వారు!


Mon,August 6, 2018 01:29 AM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కార్గోనే జిల్లా. కరువు పీడిత ప్రాంతం. ఆ జిల్లాలో బీకంగాన్ అనే పల్లెటూరు భూగర్భ జలాలు ఇంకిపోయి, కరువు విళయతాండం చేస్తున్నది. వ్యవసాయం చేసేందుకు నీరు లేక రైతులు వలసెల్లి పోతున్నారు. బావులు తవ్వించి, బోర్లు వేయించమని అధికారులను వేడుకున్నా.. పట్టించుకున్న పాపానపోలేదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తండ్రి కష్టాన్ని చూడలేక ఈ కూతుళ్లే ఏకంగా బావిని తవ్వి, బహుమతిగా ఇచ్చారు.
kavitha,jyothi
బీకంగాన్ గ్రామానికి చెందిన బాబు భాస్కర్ తన పొలంలో బావులు తవ్వించాలని అధికారులను వేడుకున్నాడు. వారి చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అయినా ఎవ్వరూ కనికరించలేదు. ఇంట్లో ఉన్న డబ్బు, కూలికి వెళ్తే వచ్చే మొత్తంతో తన ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నాడు. ఈ క్రమంలో నీరు లేక ఏటా పంటలు ఎండిపోతున్నాయి. దీంతో తండ్రి కష్టాన్ని చూడలేని కవిత, జ్యోతి.. ఇంజినీరింగ్ చదివే వారి సోదరుడు దీపక్‌తో కలిసి బావిని తవ్వేందుకు సిద్ధమయ్యారు. వారే పలుగు, పారా పట్టి బావిని తవ్వడం మొదలు పెట్టారు. ఉదయం, సాయంత్రం బావి పని, మధ్యాహ్నం చదువు. నడుముకు తాడు కట్టుకొని, లోపలి మట్టిని బయటికి తీస్తూ.. యంత్రాల్లా పనిచేశారు. ఇలా దాదాపు నాలుగు నెలల పాటు కష్టపడి 17 అడుగులు లోతుగల బావిని తవ్వేశారు. అంత లోతు నుంచి మట్టిని తీసేందుకు కొంతమంది బంధువుల సహాయంతో పలు పరికరాలు ఉపయోగించి విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకుండానే బావిని తవ్వి, దానిని తమ తండ్రికి కానుకగా ఇచ్చారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, అధికారులు ఇద్దరి కూతుళ్లను అభినందిస్తున్నారు.

740
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles