తండ్రిని చూసి.. వీడియోగేమ్ తయారుచేసి..


Tue,August 7, 2018 11:16 PM

videogame
పిల్లలు పెద్దవాళ్లను అనుకరిస్తారు అనే మాటకు ఇది సజీవ సాక్ష్యం. తల్లిదండ్రులనో, ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులనో చూసి పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుంటారు. వారు చేసే దానిని అనుకరిస్తారు. కానీ ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి అద్భుతం చేసింది.
ఓ కమర్షియల్ యాడ్‌లో వీడి చేతులు అద్భుతాన్ని చేశాయి అంటారు గుర్తుందా? సేమ్ టు సేమ్ ఈ ఫొటోలోని పెన్నీ మెక్‌డోనాల్డ్ చేతులు కూడా అదే అద్భుతాన్ని చేశాయి. పెన్నీ తన తండ్రిని నిత్యం చాలా దగ్గరగా గమనించేది. ఆయన ఎప్పుడు చూసినా కంప్యూటర్‌తో కుస్తీ పడుతుండేవాడు. ఆయనో వీడియో గేమ్ డెవలపర్. ఏడు సంవత్సరాల పెన్నీ నిత్యం తండ్రి చేసే పనిని గమనించేవాడు. అలా ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్లి నాన్నా.. నీ కంప్యూటర్ నాకిస్తావా? ఒక్కరోజులో ఒక గేమ్ డెవలప్ చేస్తా అని అడిగింది. ఏం చేస్తుందో చూద్దాం అని ఆమె తండ్రి లాన్స్ 98 విండోస్‌తో రన్ అయ్యే తన కంప్యూటర్ ఇచ్చాడు.


దాంతో పాటే ఒక గేమ్ ఎలా తయారుచేయాలో ప్రారంభ దశ గైడ్‌లైన్స్‌తో ఒక బుక్‌లెట్ కూడా ఇచ్చాడు. మామూలుగా అయితే కాస్తో కూస్తో అనుభవం ఉన్నవాళ్లే మొదటిసారికే ఒక గేమ్ తయారుచేయాలంటే కాస్త టైమ్ తీసుకుంటారు. కానీ పెన్నీ మాత్రం ఏమాత్రం తడబాటు లేకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాంటి ఒక క్విజ్ గేమ్ రూపొందించింది. గణిత సంబంధ ప్రశ్నలతో పెన్నీ రూపొందించిన వీడియోగేమ్ చూసి ఆమె తండ్రి ఆశ్చర్యపోయాడు. తన ఆశ్చర్యాన్ని, తన కూతురు ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా ఆ వీడియో గేమ్‌ను పబ్లిష్ చేశాడు. అంతే.. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో గేమ్ డెవలపర్‌గా రికార్డు నమోదు చేసుకుంది పెన్నీ. ఎన్నో గేమింగ్ కంపెనీల నుంచి ఆఫర్లు కూడా అందుకుంటున్నది. ఆల్ ద బెస్ట్ పెన్నీ.

562
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles