డ్రై, డ్రైడ్ ఫ్రూట్.. ఏది మంచిదంటే?


Fri,August 17, 2018 01:31 AM

Dry-Fruites
- డ్రై, డ్రైడ్ ఫ్రూట్.. వీటిలో ఏవి తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
సహజసిద్ధంగా ఎండిన వాటిని డ్రై ఫ్రూట్స్ అని పిలుస్తుంటారు. వీటిల్లో వాల్‌నట్స్, బాదాం, పిస్తా, జీడిపప్పులు మొదలైనవి ఉంటాయి. ఎండబెట్టడం/వేడిచేసిన పండ్లను డ్రైడ్ ఫ్రూట్స్ అంటారు. వీటిల్లో యాపిల్, అరటి, కివీ, చెర్రీలు, అంజీర్, ఆఫ్రికాట్లు మొదలైనవి ఉంటాయి. ఈ రెంటిండిల్లో ఏవి తిన్నా ఆరోగ్యానికి మంచిదే. వీటిని ఎండబెట్టి, వేడిచేసినంత మాత్రాన వీటిల్లోని సహజ ప్రోటీన్లు, విటమిన్లు, లవణాలు ఎక్కడికి వెళ్లవు. పైగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి కూడా. అయితే, గుండె వ్యాధులు, బరువు సమస్యలతో ఉన్నవారు డ్రై ఫ్రూట్స్‌ను తక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ను తినేముందు రాత్రంతా వాటిని నీటిలో నానబెట్టి ఉదయం పొట్టు తీసి తినడం ఉత్తమం. ఇక డ్రైడ్ ఫ్రూట్స్‌లో చక్కెరస్థాయిలు అధికంగా ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, పిత్తాశయ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు డ్రైడ్ ఫ్రూట్స్‌ను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అయితే, డ్రైడ్ ఫ్రూట్స్ రక్తహీనత రోగులకు, క్రీడాకారులకు చాలా మంచివి. డ్రైడ్ ఫ్రూట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మీరు డ్రై, డ్రైడ్ ఫ్రూట్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు వాటిల్లో ఏవి కలిపారో ఒకసారి చూడాలి. ఎందుకంటే, తీపి, ఉప్పు కలిపినవి, వేయించిన డ్రై ఫ్రూట్స్‌తో కొత్త సమస్యలు వస్తాయి.

495
Tags

More News

VIRAL NEWS