డెవలపర్లకు ఆర్‌అండ్‌డీ కావాలి..


Sat,August 11, 2018 12:54 AM

ఏదోరకంగా సొమ్ము సంపాదించాలన్న లక్ష్యంతోనే పని చేయకూడదు. మనం చేసే పనిలో నాణ్యత ఉండాలి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదు. మనం కష్టపడ్డప్పుడు గుర్తింపు దానంతట అదే వస్తుందని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. బెర్లిన్‌లో జరిగిన నాట్‌కాన్ సదస్సులో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా, నిర్మాణ రంగాలకు సంబంధించి తన అనుభవాలు, అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
anil-kapur
వ్యాపారం చేసేది డబ్బు సంపాదించడం కోసమే. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కాకపోతే, కొన్ని కట్టడాల్ని కట్టినప్పుడు.. సొమ్ము పెద్దగా మిగలకపోయినా.. కనీసం ప్రశంసల జల్లులైనా కురవాలి. వారెవ్వా.. ఏం నిర్మాణం కట్టాడని ప్రతిఒక్కరూ ప్రశంసించాలి. జీవితంలో చిరకాలం గుర్తించేలా వాటిని నిర్మించాలి. అలా, మొదట్లో నాణ్యత కోసం పరితపిస్తే.. గుర్తింపు, సొమ్ము దానంతట అవే వస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దు. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ, మెర్సిడిజ్ బెంజ్‌లు వంటివి ఇప్పటికీ ప్రపంచాన్ని ఏలుతున్నాయంటే.. అవి ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానాన్ని ఆయా కార్ల డిజైన్లలో పొందుపరుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం అహర్నిశలు కృషి చేస్తుంటుంది. నిర్మాణాల్ని చేపట్టే డెవలపర్లకు ఆర్‌అండ్‌డీ విభాగం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.

n మనలో ప్రతిఒక్కరూ ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు ప్రిపరేషన్ మెరుగ్గా ఉండాలి. టీమ్ వర్క్ అనేదీ అత్యంత కీలకం. ఒక ప్రాజెక్టు చేపట్టే క్రమంలో మంచి బృందాన్ని ఎంచుకోవాలి.

304
Tags

More News

VIRAL NEWS