డయాలసిస్ ఇంట్లో చేసుకోవచ్చా?


Mon,December 10, 2018 02:34 AM

నా వయస్సు 68 సంవత్సరాలు. నాకు గత ఆరు సంవత్సరాల నుంచి బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నాయి. అయితే నెల రోజులుగా నా ముఖం, కాళ్లు వాపు వస్తున్నాయి. నీరసంగా ఉంటుంది. ఆకలి కూడా మందగించింది. డాక్టర్‌ను సంప్రదిస్తే క్రిమాటిన్, బ్లడ్ యూరియా, 2డి ఎకో పరీక్షలు చేయించాలన్నారు. క్రిమాటిన్ 6.2ఎంజీ, యూరియా 182 ఎంఎల్, గుండె పనితీరు 68.2 శాతంగా 2డీ ఎకో టెస్ట్‌లో నమోదు అయింది. దీనివల్ల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వీలు కాదన్నారు. డయాలసిస్ చేయించుకోవాల్సిందేనన్నారు. నేను ఎలాంటి డయాలసిస్ చేయించుకోవాలి? ఇంటిదగ్గర చేసుకునే అవకాశం ఉందా? తెలియజేయగలరు.
Councelling
వెంకట్‌రెడ్డిగారూ.. మీరు తెలిపిన వివరాలను బట్టిచూస్తే సామాన్యంగా గుండె పనితీరు తక్కువగా ఉండేవారిలో ఇలా కాళ్ల వాపు.. ఆయాసం ఎక్కువగా ఉంటాయి. బహుశా మీది కూడా అదే సమస్య అయి ఉండవచ్చు. కాకపోతే పరీక్షలు చేయకుండా ఏదీ నిర్ధారించలేం. మీ రక్త పరీక్షల వివరాలను బట్టి చూస్తే సమస్య తీవ్రంగానే ఉందని చెప్పవచ్చు. డయాలసిస్ అన్నారు కాబట్టి మీరు ఈ డయాలసిస్‌ను ఇంట్లోనే చేయించుకోవడం మంచిది. ప్రస్తుతం ఇంట్లోనే డయాలసిస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనిని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. ఇలా చేయడం వల్ల కొద్ది కాలానికి మీ గుండె పనితీరు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. హాస్పిటల్‌లో చేసుకునే డయాలసిస్ వల్ల మీకు కొన్ని రకాల సమస్యలు వస్తాయి. వాటికి తోడు బీపీ లెవల్స్ పడిపోయే ప్రమాదమూ ఉంది. కాబట్టి మీరు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోండి. వ్యాధి ఉంది అని పదేపదే బాధపడటం కంటే దానిని ఎలా నయం చేసుకోవాలో అనే విషయం గురించి ఆలోచించండి.

పౌష్టికాహారం తినండి. రోజూ వీలు చూసుకొని వ్యాయామం చేయండి. వ్యాయామానికి మీ వయసు, శరీరం సహకరించకపోతే ఇంట్లోనే వాకింగ్ చేయండి. బయట వాళ్లూ వీళ్లూ చెప్పే అపోహలు నమ్మకుండా వ్యాధి నివారణకు ఏం చేయాలో ఆలోచించండి!
-వెంకట్‌రెడ్డి, సూర్యాపేట

909
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles