డయాబెటిక్ న్యూరోపతికి హోమియో


Tue,January 10, 2017 01:53 AM

శరీరంలోని క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆహారంలోని పిండిపదార్తాలు రక్తంలో షుగర్ రూపంలో ఉండి శరీర కణాలకు, అంగాలకు సరఫరా జరిగి శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఈ క్రియకు ఇన్సులిన్ సహకరిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేనపుడు రక్తంలోని చక్కెర శరీరంలోని కణాలకు చేరకుండా రక్తంలోనే ఉండిపోయి రక్తంలో షుగర్ స్థాయి పెరిగి పోతుంది. ఈ స్థితినే మధుమేహం లేదా డయాబెటిస్ అంటారు. దీని వల్ల రెండు రకాల నష్టాలు ఒకటి తిన్న ఆహారం నుంచి శరీర అవయవాలకు శక్తి రవాణా జరగదు. రెండవది రక్తంలో గ్లూకోజ్ స్థితి మారిపోతుంది.
Homeopathy

రకాలు


టైప్ 1 -దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అంటారు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. కానీ ఎక్కువగా పిల్లలో కనిపిస్తుంది. క్లోమగ్రంథి పూర్తిగా దెబ్బతిని ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి ఇన్సులిన్‌ను ఇంజక్షన్ల రూపంలో జీవితాంతం వాడాల్సి ఉంటుంది.
టైప్ 2 - ఈ డయాబెటిస్‌లో క్లోమం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ క్రీయాశీలంగా ఉండదు. కణాలకు చేరాల్సిన షుగర్ రక్తంలో ఉండిపోతుంది. ఇది ఎక్కువగా మధ్య వయసులో కనిపించే సమస్య.జెస్టేషనల్ డయాబెటిస్ - గర్భం దాల్చినపుడు మొదటిసారిగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో షుగర్ నియంత్రించేందుకు ఇన్సులిన్ వాడుతూ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. కొందరిలో టైప్ 2 డయాబెటిస్‌గా కొనసాగుతుంది.

డయాబెటిక్ న్యూరోపతి


డయాబెటిస్‌లో సాధారణం గా కనిపించే దుష్పప్రభావం నాడుల మీద ఉన్నపుడు దాన్ని న్యూరోపతి అంటారు.
న్యూరోపతి 2 రకాలు - కాళ్లకు చేతులకు వచ్చే పెరీఫెరల్ న్యూరోపతి.
జీర్ణవ్యవస్థకు, మూత్ర విసర్జన వ్యవస్థకు, రక్తనాళాలకు వచ్చే అటోనామిక్ న్యూరోపతి. రక్తంలోని గ్లూకోజును ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవడం ద్వారా రాకుండా నియంత్రచవచ్చు.

జీర్ణవ్యవస్థకు సంబంధించిన న్యూరోపతి లక్షణాలు


తేన్పులు, మలబద్దకం, గుండెల్లో మంట, వాంతులు, అన్నం తినగానే కడుపు ఉబ్బరంగా ఉండడం. రక్తకణాలకు సంబంధించిన న్యూరోపతి. లేచి నిలబడగానే కళ్లు బైర్లు కమ్మడం, గుండె వేగంగా కొట్టుకోవడం, లో బీపి లైంగిక న్యూరోపతి లక్షణాలు అంగస్తంభనలు లేకపోవడం, కడుపు ఉబ్బరం, మూత్రవిసర్జన మీద అదుపుకోల్పోవడం, రాత్రుళ్లు మాటిమాటికి మూత్ర విజర్జన చెయ్యాల్సి రావడం

నిర్థారణ


ఎఫ్‌బీఎస్, ఎఫ్‌ఎల్‌బీఎస్, హెచ్‌బి ఏ/సి పరీక్షలతో వ్యాధిని నిర్ధారించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు


కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మధ్య వయసుకు వచ్చిన వారు ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ విధంగా దెబ్బలు తగలకుండా చూసుకోవాలి.

హోమియో వైద్యం


REDDY
పాజిటివ్ హోమియోపతిలో డయాబెటిస్‌కు చాలా అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ముఖ్యంగా టైప్2 డయాబెటిస్‌తో వచ్చే దుష్పప్రభావాలను సులభంగా అధిగమించవచ్చు. కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా ఇచ్చే మందుల ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

1094
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles