టీ ఎక్కువైతే ప్రమాదమే!


Mon,December 10, 2018 02:30 AM

మితంగా తీసుకునే వరకూ ఏ ఆహార పానీయాలైనా అమృతంతో సమానమే. అమితంగా తీసుకుంటే మాత్రం విషమే..అటువంటి పానీయాల్లో టీ ఒకటి. టీని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కన్నా హానే ఎక్కువ జరుగుతుంది అని నిపుణులు చెప్పుకొస్తున్నారు.
tea
ఎక్కువగా టీ తాగడం వల్ల నిద్ర పట్టక రెస్ట్‌లెస్‌నెస్‌గా ఫీలవుతారు. ఆందోళనతో హార్ట్ రేట్ పెరుగుతుంది, అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడుతారు. టీ బాగా అలవాటు ఉన్నవాళ్లు టీ తాగకపోతే తలనొప్పి, అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనబడుతాయి. ఎక్కువగా టీ తాగడం వల్ల అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య స్కెలిటల్ ఫ్లోరోసిస్ అనే బోన్ డిసీజ్‌కు కారణమవుతుంది. ఎక్కువగా టీ తాగే ఆడవాళ్లలో ఎదురయ్యే సమస్య ప్రొస్టేట్ క్యాన్సర్. గర్భిణీలు బ్లాక్ టీని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు, టీలో ఉండే కెఫిన్ కంటెంట్ పొట్టలో పెరిగే ఫీటస్ మీద ప్రభావం చూపుతుంది. గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. గర్భం కోసం ప్లాన్ చేసుకునే వారు కాఫీ, టీలను పూర్తిగా మానేయడం చాలా మంచిది. ఇంకా టీ అధికంగా తాగడం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు,గుండె సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందట.

706
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles