టీవీ చూసి ఎంజాయ్ చేస్తాయి!


Sun,December 16, 2018 01:06 AM

మనం మాత్రమే టీవీని చూసి ఎంజాయ్ చేస్తామంటే పొరపాటు పడినట్లే. మనలా టీవీని చూసి ఎంజాయ్ చేసే జీవులున్నాయంటే నమ్మగలరా? డాల్ఫిన్లు ఆ పనిచేస్తాయని ఓ పరిశోధనలో తేలింది. ఇంకా ఆ పరిశోధన సంగతులేంటంటే..
dolphins
శాస్త్రవేత్తలన్నాక దేనిమీదో ఒక దాని మీద పరిశోధనలు చేస్తుంటారు. ఈసారి ముద్దుగా, బొద్దుగా ఉండే డాల్ఫిన్ల మీద పడ్డారు. నీటిలో ఎప్పటికీ సంచరించే వాటికి ఏకాగ్రత అనేది ఉంటుందా అనే సందేహం వచ్చింది. అందుకే వాటికోసం రెండు టీవీ షోలను ఏర్పాటు చేశారు. నీటిలో పెద్ద టీవీని పెట్టారు. ప్రతిరోజూ ప్లానెట్ ఎర్త్ స్టేరింగ్ సినిమాని ఎపిసోడ్స్‌గా చూపించడం మొదలుపెట్టారు. ఎపిసోడ్ మొదలయ్యే సరికి ఆడ, మగ డాల్ఫిన్లు టీవీ దగ్గరకి ఒక్కొక్కటి వచ్చేవి. ఇందులో ఆడ డాల్ఫిన్ల కంటే మగ డాల్ఫిన్లే ఎక్కువ సమయం టీవీని ఆసక్తిగా చూశాయట. అంతేకాదు.. షో చూస్తున్నంత సేపు అందులో వచ్చే జోకులు, బాధ కలిగే సంఘటనలను చూసి డాల్ఫిన్లు బాగా రియాక్ట్ అయ్యాయట. బాధ కలిగినప్పుడు స్క్రీన్ దగ్గరకి వెళ్లి నుదుటితో రుద్దడం, సంతోషం కలిగితే అటుఇటు కదులుతూ ఎగురడంలాంటివి చేశాయి. ఆ ఒక్క షోనే కాకుండా.. డాల్ఫిన్ల కోసం రకరకాల షోలు కూడా వేశారట. వాటిని చూస్తూ డాల్ఫిన్లు ఎంజాయ్ చేయడం శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. డాల్ఫిన్లు.. మనుషుల్లా వాటి అభిరుచుల్ని ప్యాషన్‌గా మార్చుకుంటాయని తేల్చేశారు. ఆల్రెడీ కుక్కలు టీవీ చూసి ఎంజాయ్ చేయడం మన ఇండ్లలోనే గమనిస్తుంటాం. దీన్నిబట్టి జంతువులకు షోస్ చూపించడం వల్ల మనుషుల్లా ఆనందంగా గడుపుతాయని తెలిపోయింది.

333
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles