టీబీ అంటువ్యాధా?


Mon,January 21, 2019 11:31 PM

ట్యూబర్ క్యులోసిస్ (టీబీ) వ్యాధి చాలా ప్రమాదకరం. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న వ్యాధి ఇది. దీని బారిన పడినవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. కానీ టీబీ పట్ల చాలామందికి అవగాహన లేదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది ఎలా సోకుతుంది? ఇది అంటువ్యాధా? అనే విషయాలు తెలుసుకుంటే నియంత్రణ కూడా సాధ్యమవుతుంది.
TB
టీబీ అంటువ్యాధే. వయోభేదం లేకుండా ఇది ఎవరికైనా సోకుతుంది. టీబీ ఉన్నవాళ్లు గట్టిగా తుమ్మినా లేదా దగ్గినా ఆ తుంపర్లలోని మైకో బాక్టీరియమ్ ట్యూబర్‌క్లోసిస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. సమీపంలో ఉన్న వ్యక్తులు గాలి పీల్చినప్పుడు వారి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. మూడు వారాలకు మించిన దగ్గు.. రోజూ సాయంత్రంపూట దగ్గు రావడం.. ఆహారం తక్కువగా తీసుకోవడం.. శరీరం బరువు తగ్గడం.. ఛాతిలో నొప్పి.. తెమడలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తే దానిని టీబీ (క్షయ)గా భావించాల్సి ఉంటుంది. తెమడ పరీక్ష ద్వారా టీబీని నిర్ధారించవచ్చు. వైద్యులు చెప్పినంత కాలం మందులు వాడాలి. ఉపశమనంగా ఉంది కదా అని మధ్యలో మందులు ఆపేస్తే ఈ వ్యాధి రెట్టించి తిరగబెడుతుంది. ఆ దశలో మందులు కూడా అదుపు కాకపోవచ్చు. ఈ వ్యాధి పిల్లల్లో వేగంగా సోకుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా పుట్టిన బిడ్డకు వెంటనే బీజీజీ సూదిమందు వేయించాలి.

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles