టీబీతో సంతానలేమి


Tue,February 12, 2019 01:54 AM

BABY

- టీబీ.. లక్షణాలు పెద్దగా కనిపించవు.
- కానీ వ్యాధి ముదిరితే తీవ్ర సమస్యలు వస్తాయి.
- టీబీ చుట్టూ.. రకరకాల రోగాలు కాచుకొని ఉంటాయి.
- అలాంటి వాటిలో ముఖ్యమైంది సంతానలేమి.
- రోజురోజుకూ విస్తరిస్తున్న టీబీ..
- మహమ్మారిగా ఎలా మారుతుందో.. సంతాన ఉత్పత్తిని ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం!


టీబీని క్షయవ్యాధి అంటారు. ఇది మైకో బాక్టీరియమ్ ట్యూబర్ క్యూలోసిస్ బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. భారతదేశంలో ప్రతియేటా 20 లక్షల మంది టీబీ వ్యాధికి గురవుతున్నారు. సుమారు 3 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీబీలో ఇండియా 5వ స్థానంలో ఉంది. ఇది ఎంత వేగంగా విస్తరిస్తుందో.. ఎంత ప్రమాదకరంగా మారుతుందో దీన్నిబట్టి చెప్పొచ్చు. కాబట్టి టీబీ పట్ల అప్రమత్తంగా ఉంటేనే దానిని నియంత్రించవచ్చు. అప్రమత్తతతో పాటు వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన కూడా అవసరం.


సంతానలేమి

క్షయవ్యాధి వల్ల ఎక్కువగా ఊపిరితిత్తులు దెబ్బ తింటున్నాయి. సరైన సమయానికి చికిత్స తీసుకోపోతే ఇది శరీరమంతా వ్యాపిస్తుంది. దీని ప్రభావం వల్ల మూత్రపిండ సమస్యలు.. గర్భసంచి సమస్యలు వస్తాయి. వీటి ప్రభావం మెదడుకూ వ్యాపించి సమస్య తీవ్రతరం అవుతుంది. ముఖ్యంగా జెనెటికల్ టీబీ వస్తుంది. ఆడ.. మగ ఇద్దరిలో సంతానోత్పత్తి తగ్గి వంధ్యత్వం ఏర్పడుతుందని ఇటీవల అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. ఆడవారికి టీబీ రావడం వల్ల గర్భసంచికి వ్యాధి సోకుతుంది. ఫలితంగా పిండం అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుంది. మగవారిలో వీర్యంలోకి వీర్యం ప్రవేశించకుండా స్తంభించిపోతుంది.


జన్యు టీబీ అంటే?

టీబీ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అంత త్వరగా బయటపడకపోయినా దాని ప్రభావం మాత్రం సంతానోత్పత్తిపై స్పష్టంగా పడుతుంది. ప్రతి 10 మంది ఆడవారిలో ఇద్దరికి సంతానలేమి సమస్యలు ఏర్పడుతాయి. దీనిని జన్యుపరమైన టీబీగా చెప్పువచ్చు. ఈ సమస్య మహిళల్లో 40-80% ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువున్నా.. వ్యాధి సోకినవారికి దగ్గరగా ఉన్నా టీబీ వ్యాధి సంక్రమిస్తుంది. క్షయ సోకినవారు తుమ్మినా.. దగ్గినా.. లైంగికంగా కలిసినా అది ఇతరులకు సంక్రమిస్తుంది.


జన్యుటీబీ లక్షణాలు

నెమ్మదిగా వ్యాపించి వేగంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యాధి ఇది. ముఖ్యంగా ఆడవారిలో రుతుక్రమం తప్పడం, రక్తంతో కూడిన నీరు.. లైంగికంగా కలిసిన తర్వాత తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మగవారిలో వీర్యకణ కదలిక తగ్గడం.. హార్మోన్లు సరిగ్గా విడుదల కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకగానే మంట దురద ఏర్పడి అంగస్తంభన ఆగి లైంగిక చర్యలకు అడ్డంకిగా మారుతుంది. ఇదే సమస్య కొంతకాలం రెగ్యులర్‌గా కొనసాగితే సంతానోత్పత్తి ఆగిపోతుంది.


ఎలా గుర్తించాలి?

జన్యుపరమైన టీబీని గుర్తించడం కష్టమే అయినప్పటికీ కొన్ని ఆధునిక పద్ధతులు సులభతరం చేస్తున్నాయి. టీబీ వ్యాధిగ్రస్తురాలైన మహిళ నుంచి ఒక ఫెలోపియన్ టిష్యూను తీసి దానిని ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయాలి. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ద్వారా కూడా టీబీని కనుక్కోవచ్చు. పాలిమర్స్ చైన్ రియాక్షన్ పద్ధతి ద్వారా కూడా కనుగోవచ్చు. కానీ ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి సరిగ్గా అంచనా వేయలేం. టీబీ సోకిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటిస్తే సంతానోత్పత్తి సాధించవచ్చు. అంటే సరైన సమయంలో సరైన చికిత్స చేయించుకోవాలి.

Pregnancy

జాగ్రత్తలేంటి?

పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లినుంచి పిల్లలకు సంక్రమిస్తుందేమో అని భయపడుతుంటారు. తల్లిపాలు కూడా ఇవ్వరు కొందరు. టీబీ అనేది తల్లిపాల వల్ల రాదు.. తల్లి ఊపిరి ద్వారా వస్తుంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి తల్లి ముఖానికి మాస్క్ ధరించి పాలు ఇవ్వాలి. టీబీ ఉన్నదని నిర్ధారణ అయిన తర్వాత దానిని నియంత్రించడానికి 6-8 నెలల పాటు క్రమం తప్పకుండా యాంటీబయోటిక్స్ మందులు వాడాలి. వాటి ద్వారా ఆడవారు ఫెలోపియన్ నాళాలు బాగుపడతాయనే నమ్మకం లేదు. చాలామంది డాక్టర్లు శస్త్ర చికిత్స చేస్తారు లేదా. ఐసీఎస్‌ఐ పద్ధతిని వాడతారు. టీబీ ఉన్నవాళ్లు రద్దీ ప్రదేశాల్లో తిరగొద్దు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిరోధిక టీకాలు వేయించుకోవాలి.

Pregnancy1

ఎవరికి సోకుతుంది?

ఎవరైతే పోషకాహారలోపంతో బాధపడుతుంటారో వారికి వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా లేక టీబీ వచ్చే ప్రమాదముంది. చికిత్సా సమయంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. మద్యం.. మాంసం.. కప్ కేకులు.. తీపి పదార్థాలు తినడం మానేయాలి. ఎక్కువగా ఆకుకూరలు.. ఐరన్.. విటమిన్-డీ3 ఉన్న పదార్థాలు తినాలి. ఆహారం సరిగ్గా లేకపోతే చికిత్స పని చెయ్యక ఇతర ఇన్ఫెక్షన్‌లు సోకుతాయి. మీ కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగి ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులు ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఛాతి ఎక్స్‌రే.. ట్యుబర్‌క్యూలెన్ పరీక్షలు చేయించుకుంటే టీబీ సోకిందా లేదా అనేది తెలుస్తుంది. చిన్న పిల్లలకు త్వరగా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కానీ దాని లక్షణాలు తెలుసుకోవడం కష్టం. కొన్ని సందర్భాల్లో ఇయోనైజ్డ్ వంటివి ఇవ్వాలి.
Swathi

360
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles