టమాటాలను వేడి నీటితో ఉడికిస్తే..


Sat,September 8, 2018 01:17 AM

Vanta-Chitkalu
-ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు చక్కెర వేస్తే త్వరగా వేగుతాయి.
-ఇంగువ గడ్డ కడితే, ఆ డబ్బాలో నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తే పొడిగా అవుతుంది.
-టమాటాలు వండడానికి ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటకాలు రుచిగా ఉంటాయి.
-కోడిగుడ్డు పెంకులను కిటికీల వద్ద పెడితే, క్రిమి కీటకాలు దరిచేరవు.
-వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలను వేస్తే, మంచి వాసన వస్తుంది.
-వంకాయకూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా ఉంటుంది.
-నిలువ పచ్చళ్లకు ఆవనూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
-కాలిఫ్లవర్, పాలకూర వంటి వాటిని శుభ్రం చేయటానికి నీటిలో కొద్దిగా వెనిగర్ కలుపండి.
-గుడ్లను ఉడికించే నీళ్లల్లో కాస్త ఉప్పు వేస్తే అవి పగిలిపోకుండా ఉంటాయి.

117
Tags

More News

VIRAL NEWS

Featured Articles