టమాటాతో డీ-టానింగ్!


Mon,August 6, 2018 11:26 PM

ఎండకు ఎక్కువగా తిరుగుతున్నారా? అయితే ముఖకాంతి కచ్చితంగా తగ్గి ఉంటుంది. ఈ వేడిమి వల్ల.. పిగ్మెంటేషన్, పొడిచర్మం, మచ్చలు వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఇప్పుడు టమాటాతో తొలిగించవచ్చు.
tomato makeup
-టమాటాను రెండు ముక్కలుగా కోసి నీళ్లలో వేసి ఉడికించాలి. ఆ తరువాత దానిని మెత్తగా పేస్టులా తయారుచేసి కొంచెం పెరుగును కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖంపై ఐప్లె చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేస్తే ముఖంపై మచ్చలూ పోతాయి.
-టమాట, ఆలుగడ్డ మీద ఉన్న తొక్కను తీసి గ్రైండ్ చేసి మెత్తగా పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌తో మెడ, ముఖంపై రాయాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఈ ప్యాక్‌ను వాడడం వల్ల ముఖం అందంగా తయారవుతుంది.
-తాజా టమాట రసాన్ని తీసుకొని అందులో కొంచెం నిమ్మరసాన్ని కలుపాలి. శుభ్రంగా ఉన్న ఓట్‌మీల్‌ను గ్రైండ్‌లో వేసి పొడిగా చేయాలి. ఈ మూడింటినీ కలిపి పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని మృదువుగా మెడ, ముఖంపై ఐదు నిమిషాల పాటు రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles