జుట్టు సమస్యలకు పరిష్కారం!


Sun,August 5, 2018 01:17 AM

జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం వంటి సమస్యలతో నిరుత్సాహపడుతున్నారా! వీటన్నింటిని నివారించడానికి జుట్టును మెరుగుపరిచేందుకు కొన్ని చిట్కాలు మీకోసం.
hair-fall
-మెంతులను రాత్రంతా నానబెట్టి మెత్తగా పేస్టులా తయారుచేయాలి. దీనిలో కొంచెం నిమ్మరసాన్ని కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌పై ఐప్లె చేయాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ప్రతిరోజు ఇలా చేస్తే డాండ్రఫ్ సమస్య తగ్గి జుట్టు రాలడం తగ్గుతుంది
-క్యాస్టర్ ఆయిల్ లేదా ఇతర ఆయిల్‌లో రోజ్ మేరీని కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్, జుట్టుకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరుచూ చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
-పొప్పడికాయను మెత్తగా పేస్టులా తయారుచేయాలి. అందులో పెరుగును కలిపి మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్,జుట్టుకు ఐప్లె చేయాలి. 50 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది.
-పచ్చిపాలు, తేనెను బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్లుకు ఐప్లె చేయాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి చేస్తే జుట్టు చిక్కుపడకుండా ఉంటుంది.
-ఉసిరిపొడి, కొబ్బరినూనెను కలిపి కొంచెం వేడిచేయాలి. మిశ్రమం చల్లారిన తరువాత స్కాల్ప్‌పై ఐప్లె చేయాలి. 40 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.ఇలా తరుచూ చేస్తే జుట్టు కాంతివంతంగా ఉంటుంది.

310
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles