జుట్టుకి కీరదోస రసం!


Sun,August 19, 2018 01:21 AM

కీరదోస ఆరోగ్యానికి, అందానికే కాదు జుట్టు పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. జుట్టు చిట్లడం, చుండ్రు, వంటి సమస్యలకు కీరదోస చక్కని పరిష్కారం. సహజమైన చిట్కాలను పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అందంగా తయారవుతుంది.
keera-hair-pack
-కీరదోస రసంలో సిలికా, విటమిన్ ఎ,సి,కె, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. కీరదోస రసం జుట్టును పెరిగేలా చేస్తాయి. కీర రసంలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. జుట్టు కుదుళ్లకి, వెంట్రుకలకి తేమని అందించి జుట్టు అందంగా మారేలా చేస్తుంది.
-కీరదోస రసంలో ఉండే పోషకాలు వెంట్రుకలు చిట్లకుండా, తెగిపోకుండా చేస్తుంది. కీర రసం జుట్టు పొడిబారకుండా చేస్తుంది. వెంట్రుకను బలంగా మార్చి ఊడకుండా చూస్తుంది.
-కీరదోసలో విటమిన్ ఎ, బి5, సి, కెలు ఉండడం వల్ల మంట, దురదగా ఉన్న మాడుకు ఉపశమనాన్ని అందిస్తుంది. కీరదోస ప్యాక్ ఇలా చేయొచ్చు.
-కీరదోస రసం, అలోవెర గుజ్జు, ఆలివ్ ఆయిల్‌ను బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టును పాయలు పాయలు చేసి మొత్తం జుట్టుకు పట్టించాలి. ఐదు నిమిషాల పాటు మర్ధనా చేయాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరుగుతుంది.

294
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles