జీర్ణక్రియలో వేగం..


Wed,May 18, 2016 02:00 AM

bodyజీర్ణప్రక్రియలో భాగంగా మనం తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ చక్కెరలుగా, ప్రొటీన్లు అమైనో ఆమ్లాలుగా, కొవ్వు పదార్థాలు కొవ్వు ఆమ్లాలుగా విడిపోతాయి. ఇందుకు సహకరించే కొన్ని ఎంజైమ్స్ మొలకెత్తిన గింజల్లో ఉంటాయి. మన శరీరంలోని ఎంజైమ్స్ కన్నా వీటిలోని ఈ ఎంజైమ్స్ మరింత సమర్థంగా పనిచేస్తాయి. విత్తనాలను మొలకెత్తించడం వల్ల వాటిలో ఉండే ఈ ఎంజైమ్స్ చర్యాశీలత పెరుగుతుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌పై పనిఏసే అమైలేజ్ చురుకుదనం పెరుగుతుంది. మొలకెత్తించినప్పుడు పోషకాల స్థాయి మరింత పెరుగుతుంది. మొలకెత్తించినప్పుడు గింజలోల్ని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎంజైమ్స్ మరింత సులభ ప్రక్రియల ద్వారా మన శరీరంలోకి చేరుతాయి.

1645
Tags

More News

VIRAL NEWS