జింకు ఉండగా జంకు ఎందుకు?


Mon,April 15, 2019 11:14 PM

శరీరంలో లోహ శాతం కూడా ఉంటుంది. ఉండటమే కాదు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో లోహాలు కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటివాటిలో జింక్ ముఖ్యమైంది. ఇది సరైన మోతాదులో లేకపోతే ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి.
vitamins-supplements
రోజుకు కనీసం 50 మిల్లీగ్రాముల జింక్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరం తనకు తానుగా జింక్‌ను ఉత్పత్తి చేసుకోలేదు. కాబట్టి తగిన మోతాదులో ఆహార పదార్థాల రూపంలో జింక్‌ను తీసుకోవాలి. తక్కువ జింక్ తీసుకుంటే ప్రొస్టేట్‌వాపు.. క్యాన్సర్ ముప్పు తప్పదు. సాధారణంగా ఎక్కువమందిలో హైపర్‌టెన్షన్ సమస్యలు వస్తున్నాయి. చిక్కుళ్లు.. గింజ ధాన్యాలు.. పీతలు.. పుట్టగొడుగులు.. పెరుగు.. పాలకూర.. నువ్వులు.. గుమ్మడి గింజ ల్లో పుష్కలమైన జింక్ లభిస్తుంది. కాబట్టి వాటిని తినడం అలవాటు చేసుకోవాలి. వీటిద్వారా సరిపడా జింకు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఏ జంకూ లేకుండా హాయిగా ఉండవచ్చు.

77
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles