జర్మనీలో క్రెడాయ్ నాట్‌కాన్-18


Sat,July 28, 2018 12:31 AM

జర్మనీలోని బెర్లిన్‌లో క్రెడాయ్ 18వ నాట్‌కాన్ సదస్సు ఆగస్టు 2 నుంచి 4 తేదీ వరకు జరుగుతుంది. దేశంలోని వంద నగరాల నుంచి దాదాపు వెయ్యి మంది డెవలపర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బ్రేక్ ద స్టీరియోటైప్ అనే థీమ్‌ను ఈసారి క్రెడాయ్ ఎంచుకున్నది. ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా జేఎల్‌ఎల్, సీబీఆర్‌ఈ, కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ వంటి సంస్థలు పాల్గొంటున్నాయి. కలిసికట్టుగా రియల్ ఎస్టేట్ రంగంపై నివేదికను విడుదల చేస్తున్నాయి. ఈ సదస్సులో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఎండీ రేణుసూడ్ కర్నాడ్, అపాక్ ఈఎంఈఏ అధ్యక్షుడు ప్రదీప్ పంత్ తదితరులు పాల్గొంటున్నారు. రెరా, కో వర్కింగ్ స్పేసెస్, రియల్ రంగం భవిష్యత్తుపై ప్రధాన చర్చలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రెడాయ్ అధ్యక్షుడు జక్సేషా మాట్లాడుతూ.. భారత రియల్ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే రోజులు రానున్నాయన్నారు. ఈసారి క్రెడాయ్ నాట్‌కాన్ సదస్సును బెర్లిన్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో నిర్మాణ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమయ్యే చర్చ ఈ సదస్సులో జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రెడాయ్ ఛైర్మన్ గీతాంబర్ ఆనంద్ మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర నుంచి భారత రియల్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని.. ఇక రానున్న రోజుల్లో అభివృద్ధి చెందే దిశగా మార్కెట్ దూసుకెళుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రెడాయ్ అధ్యక్షుడు (ఎన్నిక) సతీష్ మగర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కారాల గురించి చర్చిస్తామని తెలిపారు. బెర్లిన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి దాదాపు నలభై మంది డెవలపర్లు పాల్గొంటున్నారని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు. నిర్మాణ రంగంలో ఆధునిక ఆవిష్కరణలు, సరికొత్త పోకడలను తెలుసుకోవడానికి నాట్‌కాన్ సదస్సు చక్కటి వేదిక కానుందని అభివర్ణించారు.

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles