ఛాయ్‌తో.. మతిమరుపు హుష్‌కాకి!


Tue,March 21, 2017 01:45 AM

తలనొప్పి వస్తే.. ఓ కప్పు ఛాయ్ తాగితే తలనొప్పి, ఒత్తిడి దెబ్బకు పారిపోతుంది. కమ్మటి వాసన.. చిక్కటి రుచి మతి పోగొడుతుంది. కానీ ఇకనుంచి టీ తాగితే మతిమరుపు కూడా పోతుందనే విషయం మీకు తెలుసా?
chai
క్రమం తప్పకుండా గ్రీన్ టీ, బ్లాక్ టీ, టీ తాగే వారిలో యాభైశాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు పరిశోధకులు. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాప్లేవిన్స్ పోషకాల వల్ల మెదడు కణాల మీద ప్రభావం పడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావాలతో మెదడులోని వాస్క్యూలర్ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్ తగ్గుముఖం పడుతాయని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మతిమరుపు, డిమెన్షియా, పార్కిన్‌సన్స్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకునేవారు ఛాయ్ మీద ప్రేమ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిశోధనలకు నేతృత్యం వహించిన ఫెంగ్ లీ అనే శాస్త్రవేత్త పై విషయాలను వెల్లడించారు. మతిమరుపును దూరం చేస్తుంది కదా.. అని కప్పులకు కప్పులు తాగిడం మంచిది కాదు సుమా! రోజులో రెండు లేదా మూడు కప్పుల టీ మాత్రమే తాగాలని సూచిస్తున్నారు డాక్టర్ ఫెంగ్ లీ.

964
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS