చైనా యువత బెంబేలు


Tue,September 25, 2018 10:44 PM

కాలం మారిందండోయ్..! మన దేశంలో ఒకప్పటి కన్యాశుల్కం రోజులు మళ్లీ రాబోతున్నాయి. ప్రస్తుతం చైనాలో ఈ కన్యాశుల్కం నడుస్తున్నది. అంటే.. అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం. ఇదే తడవుగా అందమైన అమ్మాయిలున్న తల్లిదండ్రులు కట్నాలను విపరీతంగా పెంచేస్తున్నారు. దీంతో చైనా యువత.. లబోదిబోమంటున్నది.
China-Marriges
మన దగ్గరేమో అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇచ్చి పెండ్లి చేసుకుంటున్నారు. దీనిని మనం వరకట్నంగా భావిస్తున్నాం. అయితే, ఒకప్పుడు మన దేశంలో కొనసాగిన కన్యాశుల్కం రోజులు ఇప్పుడు చైనాలో కొనసాగుతున్నాయి. ఎందుకంటే అక్కడ అమ్మాయిలు తక్కువగా ఉండడంతో అబ్బాయిలే ఎదురు కట్నం ఇచ్చిమరీ పెండ్లి చేసుకుంటున్నారు. అక్కడ లింగ భేదం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుత లెక్కల ప్రకారం చైనాలో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య మూడు కోట్ల వరకు ఎక్కువగా ఉంది. దీంతో పెళ్లి కోసం అమ్మాయిలు దొరక్క అబ్బాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన అమ్మాయిల తల్లిదండ్రులు కట్నం దండుకుంటున్నారు. ఇక అందమైన అమ్మాయిలున్న తల్లిదండ్రులైతే కట్నాలను విపరీతంగా పెంచేస్తున్నారు. సగటున 38 వేల డాలర్లు డిమాండ్ చేస్తున్నారు.


ఇది అక్కడి అబ్బాయిల సగటు ఏడాది జీతం కంటే ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. నగదుతోపాటు పెళ్లికూతురు తల్లిదండ్రులకు ఇల్లు లేదా ఇతర బహుమానాలు అదనం. దీంతో అబ్బాయిల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. మా అబ్బాయికి అంత కట్నం చెల్లించుకోలేం బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటున్నారు. దీంతో కట్నాన్ని 2900 డాలర్ల కంటే ఎక్కువ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఆ ఒక్క సంతానం అబ్బాయి అయితేనే బాగుంటుందని నమ్మారు. చాలామంది అమ్మాయి అని తెలవగానే అబార్షన్ చేయించడం, పుట్టగానే చంపేయడం, వదిలేయడం చేశారు. దీంతో దేశంలో అమ్మాయిలకు తీవ్ర కొరత ఏర్పడింది.

1085
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles