చైతన్యం కోసం..రంగుల హరివిల్లు!


Sun,August 12, 2018 12:53 AM

భారతదేశంలో వేశ్యావృత్తి ఇప్పటికీ.. ఎప్పటికీ ఒక పెద్ద సమస్యే. దేశంలో రోజూ 30 లక్షల మంది సెక్స్ వర్కర్స్‌గా పనిచేస్తున్నారని అంచనా. అయితే వీరిపై జరిగే హింసకు వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్లు వినూత్నంగా పెయింటింగ్‌తో సమాధానం చెబుతున్నారు.
redlight
కోల్‌కతా మహానగరంలో సోనాగాఛీ అనే ప్రాంతం ఉంది. ఇది రెడ్ లైట్ ఏరియాగా పేరుగాంచింది. ఇరుకిరుకు గల్లీలతో ఉండే ఈ ప్రాంతాన్ని ఆసియాలోనే అతి పెద్ద వ్యభిచార కేంద్రంగా పరిగణిస్తారు. ఇక్కడ దాదాపు 11వేల మంది సెక్స్‌వర్కర్లుగా ఉన్నారని అంచనా. వీరి హక్కుల కోసం, మహిళలపై జరుగుతున్న హింస అంతాఇంతా కాదు. దీనికి అడ్డుకట్ట వేయడానికి.. వారిలో చైతన్యం తీసుకురావడానికి ట్రాన్స్‌జెండర్లు నడుం బిగించారు. ఇందులో ఉండే కళాకారులు వారు నివసిస్తున్న ఇళ్లకి పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టారు. బెంగళూరుకు చెందిన ఓ ఆర్ట్ గ్రూప్ వీరికి సహకారం అందిస్తున్నది. ఇక్కడున్న వేశ్యాగృహాల్లో చాలావరకు శిథిలావస్థలో ఉన్నాయి. చాలాచోట్ల గోడలు కూలిపోయాయి. వేరే వారి గోడలతో కలిసిపోయాయి. వీరు నిర్మించుకున్న కో-ఆపరేటివ్ బిల్డింగ్ కూడా ఎప్పటిదో. వీటన్నిటికీ వారు మరమ్మత్తులు చేపట్టి అందమైన పెయింటింగ్‌లతో రంగుల హరివిల్లులాగా మార్చారు. మరికొన్ని ఇండ్లకు కూడా పెయింట్స్ వేసేందుకు ప్రణాళికలను కూడా రూపొందించారు. మొత్తానికి వీరి ఆలోచన అందరినీ ఆలోచింపచేసే విధంగా, అలాగే అందంగా ఉందని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

475
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles