చెట్లను బతికించుకుందాం!


Tue,September 4, 2018 03:01 AM

Paryavaranam
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల అరణ్యాలు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున తగ్గుముఖం పడుతున్నాయని, అదే పనిగా క్షీణించిపోతున్న చెట్లను తక్షణం బతికించుకోకపోతే మానవజాతికి భవిష్యత్తు శూన్యమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.


ఇటీవల విడుదలైన ఒక అంతర్జాతీయ నివేదిక అంచనా మేరకు ఒక్క 2017లోనే మొత్తం 39 మిలియన్ ఎకరాల ఉష్ణమండల అరణ్యాలు (Tropical forests) కనుమరుగయ్యాయి. ఇది ఇంచుమించు బంగ్లాదేశ్ భూభాగానికి సమానమంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వాషింగ్టన్‌లోని వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (డబ్లుఆర్‌ఐ) తాజాగా విడుదల చేసిన నివేదిక పై విషయాన్ని వెల్లడించింది. ప్రతి ఏడాదిలో ఒక్కో నిమిషానికి గణనీయ సంఖ్యలో చెట్లు క్షీణిస్తున్నట్టు పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ క్షేత్రాలు, నివాస ప్రాంతాల పెరుగుదల, అగ్నిప్రమాదాలు, ఉష్ణమండల తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలతో సంభవిస్తున్న వాతావరణ మార్పులవల్లే అరణ్యాలు పెద్ద ఎత్తున అంతర్ధానమవుతున్నట్టు వారు ప్రకటించారు. 2001 నుంచి 2017 వరకు లభ్యమైన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఆధారంగానే తాము పై నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు.

336
Tags

More News

VIRAL NEWS