చూపులేని చాంపియన్!


Thu,April 20, 2017 11:36 PM

ఆమె ఓ ఛాంపియన్. జిల్లాస్థాయి.. రాష్ట్రస్థాయి కాదు. ఇంటర్నేషనల్ చాంపియన్. ఇంతకూ ఆమె ఆటేంటో తెలుసా? స్విమ్మింగ్. ఏముంది.. ఈ రోజుల్లో మహిళలు అన్నింట్లోనూ రాణిస్తున్నారు. ఇది కూడా అంతే అయ్యుండొచ్చని లైట్ తీసుకోకండి. ఈమె చూపులేని చాంపియన్. చూపున్న వాళ్లను స్విమ్మింగ్‌లో ఓడిస్తూ జీవితంలో గెలిచిన డైనమిక్ ఛాంపియన్.
Blind-Swimmer
మహారాష్ట్రకు చెందిన ఈమె పేరు కాంచనమాల. చూపులేకున్నా నీటి స్పర్శను పసిగట్టి చేపలా ఈదుతూ సాధారణ స్విమ్మర్లకు చెమటలు పట్టిస్తున్నది. 25 ఏళ్ల ఈ పారా అథ్లెట్ ఇప్పటికే పలు జాతీయ.. అంతర్జాతీయ పతకాలు సాధించింది. స్విమ్మింగ్‌పూల్ అనేది ఎలా ఉంటుందో కూడా చూడని ఈమె స్విమ్మింగ్‌లో నిర్విరామ సాధన చేస్తున్నది. 2020 టోక్యో పారాలింపిక్స్ లక్ష్యంగా కృషిచేస్తున్నది. పోటీదారులెవరో, ఎలా ఉంటారో కూడా ఈమెకు తెలియదు. కానీ నీళ్లలో వారు చేసే శబ్దాలను పసిగట్టి పోటీలో అందరికంటే ముందుండి విజయ పరంపర కొనసాగిస్తున్నది. పదేళ్ల వయసున్నప్పుడే స్విమ్మింగ్ ప్రారంభించిన కాంచన ఇప్పటివరకు 110కి పైగా పతకాలు సాధించింది. వీటిలో 30 రాష్ట్ర స్థాయి పతకాలు కాగా.. రెండు ఆసియా గేమ్స్ పతకాలు. మెల్‌బోర్న్ కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆరు పతకాలు సాధించింది. మిగిలిన స్విమ్మర్లు గాగుల్స్ పెట్టుకుని పూల్ అడుగున ఏముందో చూస్తారు. కానీ నేను పుట్టుకతో అంధురాలిని. ఏ పరికరాలూ సాయం చేయవు. ఒకసారి నేను నీళ్లలోకి దిగాక.. నాకు కళ్లున్నా లేకపోయినా ఒక్కటే. నా పోటీదారులు చేసే శబ్దాన్ని విని దానికి అనుగుణంగా దూసుకెళ్తా అంటున్నది కాంచన. భర్తే తనకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారని.. తనలో ఎల్లప్పుడు ఆయన క్రీడా స్ఫూర్తి నింపుతున్నారని.. రాబోయే పారా గేమ్స్.. ఒలింపిక్స్‌పై ప్రస్తుతం దృష్టి సారించినట్లు చెబుతున్నది. ప్రస్తుతం హిందీ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న ఈమె ఇప్పటివరకు నజర్ యా నజారియా, యహీ హై రోష్నీ కా కార్వాన్ అనే సీరియల్స్‌లో కనిపించింది.

594
Tags

More News

VIRAL NEWS