చుండ్రు తగ్గాలంటే..


Sat,November 24, 2018 12:18 AM

తలస్నానం సులువుగా చేయడానికి షాంపూని వాడుతుంటాం. షాంపూలో కొన్ని పదార్థాలు కలుపుకొని తలస్నానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.
haircare
-చుండ్రు, దుమ్ము కారణంగా తల దురద పెడుతుంటుంది. షాంపూలో కొంచెం రోజ్‌వాటర్ కలుపాలి. ఆ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రుతో పాటు దురద కూడా తగ్గుతుంది.
-షాంపూలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తలస్నానం చేస్తే జట్టు నిగనిగలాడుతుంది. అంతేకాకుండా జుట్టుకు తేమ అందడంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది.
-షాంపూలో కొంచెం తేనె కలుపుకొని తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా, దృఢంగా ఉంటుంది.
-జుట్టు ఎక్కువగా ఊడుతుంటే ఆరోమా నూనెను షాంపూలో కలుపుకొని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.
-కలబంద గుజ్జు, షాంపూ కలుపుకొని తలస్నానం చేస్తే చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
-జుట్టురాలే సమస్య ఉన్నవారు షాంపూలో కొద్దిగా ఉసిరికాయ రసాన్ని కలుపుకొని తలస్నానం చేస్తే జట్టు రాలడం తగ్గుతుంది.

759
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles