చుండ్రుతో బాధ పడుతున్నారా?


Wed,August 8, 2018 01:02 AM

తలపై ఉన్న చర్మం పొట్టుగా మారి చుండ్రులా రాలుతుంది. ఒత్తిడి, ఆందోళన, పోషణలోపం వంటి కారణాలు చుండ్రు రావడానికి కారణమవుతాయి. చుండ్రువల్ల దురద కూడా ఎక్కువ అవుతుంది. ఈ చిట్కాలను వాడితే చుండ్రు నుంచి మంచి ఫలితాలను పొందవచ్చు.
dandruf
-వేపాకులతో చేసిన ఆయిల్‌ను జుట్టుకు పట్టిస్తే చుండ్రు పోవడమే కాకుండా మంచి పోషణ అందుతుంది. దానివల్ల శిరోజాలు దృఢంగా.. ఒత్తుగా పెరుగుతాయి.
-కొబ్బరినూనెలో కొద్దిగా ఆముదాన్ని కలిపి కాసేపు మరిగించాలి. ఆ మిశ్రమం చల్లారిన తరువాత వెంట్రుకలకు రాసుకోవాలి. రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే చుండ్రు నుంచి మంచి ఫలితం ఉంటుంది.
-మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తని పేస్టులా తయారుచేసుకోవాలి. దీనిని జుట్టుకు పట్టించి 60 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే చుండ్రు నుంచి బాధ తప్పుతుంది.

423
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles