చిలుకూరు బాలాజీ దర్శన్


Thu,August 9, 2018 11:08 PM

chilkur-balajitemple
తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం పర్యాటక శాఖ వివిధ పర్యాటక ప్రాంతాల సందర్శనకు పలు ప్యాకేజీలను ప్రకటిస్తున్నది. వాటిలో చిలుకూరు బాలాజీ దర్శన్ ప్యాకేజీ కూడా ఒకటి. ప్రతిరోజు ఉండే ఈ ప్యాకేజీ ఆసక్తి ఉన్న పర్యాటకులు బుక్ చేసుకోవచ్చు. ఒకరోజు కోసం కేటాయించిన ఈ ప్యాకేజీలో మృగవని నేషనల్ పార్క్, చిలుకూరు బాలాజీ దేవాలయం, లోటస్‌పార్క్‌లను చూపిస్తారు.

ఈ ప్యాకేజీలో చిలుకూరు బాలాజీని దర్శించాలనుకునేవారు ఏసీ బస్ అయితే పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.560, నాన్‌ఏసీ అయితే పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఏడుగంటలకు పర్యాటక కార్యాలయం నుండి బయలుదేరే ఈ బస్ సాయంత్రం తొమ్మిది గంటలకు తిరిగి చేరుకుంటుంది. ఈ ప్యాకేజీలో మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది.

700
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles