చిరుతను బెదిరించిన కుక్క!


Sat,September 8, 2018 11:02 PM

ఏంటీ.. హెడ్డింగ్ చూసి ఇదేదో చిన్నపిల్లల కథ అనుకుంటున్నారా? అస్సలు కాదు. రాజస్థాన్‌లో జరిగిన వాస్తవ సంఘటన. నమ్మకం కలుగడం లేదా? అయితే వివరాలు ఇవిగో..
dog
అది రాజస్థాన్‌లోని ఘలానా రిజర్వ్ ఫారెస్ట్. గతేడాది ఈ రిజర్వ్ ఫారెస్ట్‌ను కాస్త చిరుతల సఫారీ పార్కుగా మార్చేశారు. దీంతో ఆ అడవిలో ఉన్న రకరకాల చిరుతలను చూసేందుకు పర్యాటకుల తాకిడి కూడా క్రమంగా పెరిగింది. అయితే.. ఓ రోజు జిప్సీలో ఓ పర్యాటక బృందం అడవి మొత్తం తిరుగుతున్నది. ఒకచోట రోడ్డు మీద అడ్డంగా ఓ కుక్క పడుకుంది. అదే సమయంలో అటు నుంచి ఓ చిరుతపులి కుక్క మీదకు దాడి చేసింది. చిరుతపులి తన మీదకు దూకుతుందని గ్రహించిన కుక్క వెంటనే లేచి.. గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. చిరుతపులిని కనీసం దగ్గరికి కూడా రానియ్యలేదు. చిరుతపులి అక్కడ ఉన్నంతసేపు కుక్క మొరుగుతూనే పులి మీద తిరగబడింది. కుక్క ధైర్యానికి హడలిపోయిన చిరుతపులి కొద్దిసేపు అలాగే చూసింది. అయినా.. కుక్క మొరగడం మాత్రం అపలేదు.


మరికొద్దిసేపు ఇక్కడే ఉంటే కుక్క తన మీద దాడిచేయడం తప్పదేమో అనుకున్న చిరుత అక్కడి నుంచి మెల్లగా పొదల్లోకి జారుకుంది. ఇది జస్ట్ అక్షరాల్లో ఎవరైనా చెప్తే అందరూ లైట్ తీసుకునేవాళ్లే. పర్యాటకులు ప్రయాణిస్తున్న జిప్సీ ముందే జరుగడంతో వారు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెళ్తూ.. వెళ్తూ.. ఆ కుక్కను తమ జిప్సీలో ఎక్కించుకొని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ దగ్గర వదిలిపెట్టారు. కావాలంటే మీరు కూడా సోషల్ మీడియాలో సెర్చ్ చేయండి. వీడియో దొరుకుతుంది.

787
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles