చాటుగా చాట్ తింటా!


Thu,May 24, 2018 01:41 AM

సన్నీ ఏది చేసినా సంచలనమే! పోర్న్ స్టార్ నుంచి పాపులర్ స్టార్ అయింది. ఇప్పుడు వీర మహాదేవిగా కత్తి దూయడానికి సిద్ధమైంది. మరి ఈ అందాల తార ఎలాంటి విందు ఆరగిస్తుందో, ఆమె ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసా?
sunny-leone
నేను ఎక్కువగా తినను, అలా అని కడుపు మాడ్చుకొనే రకం కాదు. నాకు ఫ్రెష్‌గా ఉండే ఫుడ్ ఇష్టం. ఒకవేళ నాకు బాగా ఆకలి అనిపిస్తే కోడిగుడ్డులోని తెల్లసొన లేదా టోస్ట్, డ్రైఫ్రూట్స్ తింటాను. ఉదయం డోనట్, కాఫీ, కోడిగుడ్డు లేదా పాన్‌కేక్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటా. నా తిండి చూస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. కూరల్లో ఉప్పు తక్కువగా వేసుకుంటా. ఏ సీజన్‌లో ఆ ఫ్రూట్స్ కచ్చితంగా తీసుకుంటా. అన్నింటిలో కివీ ఫ్రూట్‌ని ఇష్టంగా తింటాను. రోజులో ఒకసారి కొబ్బరినీళ్లు తాగుతాను. అదే నా అందాన్ని ఇలా ఉంచడానికి కారణం. బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్నిసార్లు పాలు కూడా తాగుతుంటా. నాకు స్టీమ్ చేసే చేప.. దానిమీద పచ్చిమిరపకాయలు వేసి ఇస్తే లొట్టలేసుకుంటా తింటా. ఇది నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్ డిష్. ఎక్కడికి వెళ్లినా నా వెంట చాక్లెట్స్ ఉంటాయి. అవే అప్పుడప్పుడు నా ఆకలి తీరుస్తాయి. అమ్మ చేసిన పరోటాలు బాగా తింటాను. సినిమాల్లో చేస్తున్నాను కాబట్టి డైట్ ఫాలో అవ్వాల్సి వస్తున్నది. ఒక్కోసారి ఢిల్లీలోని చాట్ బండార్‌లకి వెళుతుంటా. డైట్‌కి గుడ్ బై చెప్పి చాటుగా చాట్ లాగించేస్తా. నేను తినడమే కాదు.. వంట కూడా చేస్తాను. నా భర్త డేనియల్ కూడా నాతో పాటు కలిసి వంట చేస్తుంటాడు. ఇద్దరం కలిసి హెల్దీ మీల్స్ తయారుచేస్తాం. పాస్తా, నూడుల్స్, ఆమ్లెట్స్ నేను బాగా చేస్తాను. ముంబైలోని ఫ్యాటీ బావో అనే రెస్టారెంట్‌కి తరుచుగా వెళ్తుంటా.

1410
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles