చలికాలం కొబ్బరి నూనెతో..


Mon,December 10, 2018 02:27 AM

coconut_oil
-స్నానానికి ముందు కొబ్బరి నూనెతో శరీరమంతా సున్నితంగా మసాజ్ చేస్తే చర్మం మృదువుగా మారిపోతుంది.
-చలికాలంలో పొడి చర్మం బాధిస్తుంటే గోరువెచ్చటి నీటిలో రెండు,మూడు చుక్కల కొబ్బరి నూనె కలుపుకుని స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
-చలిగాలికి తల వెంట్రుకలు బిగుసుకుపోతాయి. రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరినూనెతో వెంట్రుకలకు మర్దన చేసి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే మీ కురులు పట్టులా మెరుస్తాయి.
-వయసు రీత్యా వచ్చే మచ్చలకు చెక్ పెట్టాలంటే సౌందర్య సాధనాలు పక్కన పడేసి మీ చర్మానికి నిత్యం కొబ్బరినూనె ఐప్లె చేయండి.
-రాత్రి పడుకునే ముందు కాళ్లు, చేతులు, ముఖం సబ్బుతో శుభ్రం చేసి కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చలికాలం రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మం అందం ఏ మాత్రం తగ్గదు.

566
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles