చరిత్ర సృష్టించింది..

Tue,March 21, 2017 01:46 AM

యూనివర్సిటీల్లో, కాలేజీల్లో విద్యార్థి సంఘాల ఎలక్షన్లు జరుగడం, ప్రెసిడెంట్లు ఎన్నికవడం సర్వసాధారణమే. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ సాకేత్ యూనివర్సిటీలో ప్రెసిడెంట్ ఎన్నికను మాత్రం ప్రస్తుతం అందరూ అద్భుతంలా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే..?
ektha-singh
క్యాంపస్ రాజకీయాలు భయంకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ర్టాల్లో మరీ దారుణంగా ఉంటాయి. అందుకే అమ్మాయిలు వాటికి దూరంగా ఉంటారు. కానీ ఫైజాబాద్ సాకేత్ యూనివర్సిటీలో చరిత్ర తిరుగరాసింది ఏక్తా సింగ్. ఇటీవల జరిగిన స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో విజయ బావుటా ఎగురవేసింది. 86 ఏళ్ల వర్సిటీ చరిత్రలో తొలిసారిగా అక్కడ ఒక అమ్మాయి స్టూడెంట్ లీడర్‌గా ఎన్నికైంది. 22 ఏళ్ల ఏక్తా సింగ్ అంత సులభంగా ఈ స్థాయికి చేరలేదు. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను ఎలుగెత్తి ప్రశ్నించింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసింది. మంచినీరు తాగేటప్పుడు కూలర్ల దగ్గర, ఫీజులు కట్టేటప్పుడు కౌంటర్ల దగ్గర, బస్టాపుల దగ్గర.. ఆడపిల్లల పట్ల ఆకతాయిల వెకిలి చేష్టల్ని అరికట్టేందుకు కృషి చేసింది. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా వర్సిటీలో అందరూ సమానమేనన్న భావనను ప్రచారం చేసింది. కాలేజీలో అనవసరమైన రాజకీయాలు లేకుండా విద్యార్థులంతా ఒక్కతాటి పైకి వచ్చేలా చేయడంలో సఫలీకృతమైంది. అందుకే ఆమె వెంట 11 వేల మంది విద్యార్థులు మద్దతుగా నిలిచారు. తమ నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు యూనివర్సిటీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆడపిల్లలు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. వాటర్ కూలర్ నుంచి లైబ్రరీ వరకు ఎక్కడా వారికి ఇబ్బందులు లేవు. ఇదంతా ఈ యంగ్ లీడర్‌వల్లే అంటున్నారు విద్యార్థులు. విమర్శించేవాళ్లు కూడా ఆమె ధైర్యానికి అభిమానులైపోయారు.

762
Tags

More News

మరిన్ని వార్తలు...