చదువుల్లో అమ్మాయిలు టాప్!


Sat,September 29, 2018 10:53 PM

అబ్బాయిలు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. దీనికి కారణం అమ్మాయిలు ఎక్కువగా చదువడమేనట. ఈ సంగతి ఒక పరిశోధనలో తేలింది.
girls-better
ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మాయి పుడితే.. అమ్మాయా? అని అనుకునేవాళ్లున్నారు. కానీ ఈ కాలంలో అన్నింట్లో ముందడుగు వేస్తూ దూసుకుపోతున్నారు అమ్మాయిలు. చదువుల్లోనూ వాళ్లే టాప్‌గా నిలుస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదంటున్నారు శాస్త్రవేత్తలు. దీనిపై ఒక పరిశోధననే చేపట్టారు. పది నుంచి పద్దెనిమిదేళ్ల వయసులోపు పిల్లలను పరిగణనలోకి తీసుకున్నారు. అమెరికాకు చెందిన మొత్తం నాలుగు మిలియన్ల విద్యార్థులకు ఒక పరీక్ష పెట్టారు. చదవడం, రాయడంలో అమ్మాయిలకే ఎక్కువ మార్కులు వచ్చినట్లు తెలింది. రెండవ రౌండ్‌లో డిగ్రీ లెవల్లో టెస్ట్ కండక్ట్ చేశారు. ఒకే వయసున్న పిల్లల ఆలోచనలు, తెలివితేటలు చాలా రకాలుగా ఉంటాయి.


అబ్బాయిలు మాత్రం వారి చదువుకు తగ్గట్టుగా తెలిసినవి మాత్రమే రాసి మిగిలినవి ఖాళీగా వదులగా, ఆడపిల్లలు మాత్రం మెదడుకు పదును పెట్టి తెలివితేటలతో పరీక్ష పూర్తిచేశారు. రెండవ రౌండ్‌లో కూడా అమ్మాయిలే ఎక్కువ మార్కులు సాధించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రశ్నలను చదివి, అర్థం చేసుకొని అమ్మాయిలు అద్భుతంగా రాశారని తెలిపారు. ఆడపిల్లలను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తుంటే అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోరని వారు చెప్తున్నారు. కాబట్టి అమ్మాయిలూ నీరసపడకుండా అబ్బాయిలతో పోటీపడండి. అబ్బాయిలూ.. మీరు కూడా తక్కువేమీ కాదు.. ఆడపిల్లలకు తగిన పోటీనిస్తూ గెలుపు తీరాలకు చేరుకోండి.

827
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles