గ్రహశకలం రాక రేపే!


Mon,August 27, 2018 11:17 PM

భూమికి అతిదగ్గరగా ఒక గ్రహశకలం రేపు వస్తున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. చంద్రుని దూరానికి పదమూడు రెట్లు ఎక్కువగా, అత్యంత సమీప స్థానానికి చేరుకొనే ఈ ఆస్టరాయిడ్‌తో ప్రమాదమేమీ లేదని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా వెల్లడించారు.
Vishwa-Darshanam
ఆస్టరాయిడ్ 2016 ఎన్‌ఎఫ్23గా పిలుస్తున్న అంతరిక్ష గ్రహశకలం రేపు (ఆగస్టు 29) భూమికి కేవలం 30 లక్షల మైళ్ల దూరంలో, అతిసమీప స్థానానికి వస్తున్నట్టు నాసా తాజాగా పేర్కొంది. ఇది కేవలం మన చందమామ దూరానికి 13 రెట్లు ఎక్కువ. ఇంత దగ్గరగా వస్తున్న ఈ గ్రహశకలం గంటకు 20,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ, 230- 525 అడుగుల వెడల్పుతో ఒకింత పెద్ద పరిమాణాన్నే కలిగి ఉన్నట్టు నాసా పరిశోధకులు వెల్లడించారు. అతి తక్కువగా బోయింగ్ 747 విమానమంత సైజులో, అత్యధికంగా ఈజిప్టుకు చెందిన గిజాలోని గ్రేట్ పిరమిడ్ కంటే పెద్దగా ఉన్నట్టు వారు చెప్పారు. ఇది ఒకవేళ భూవాతావరణంలోకి ప్రవేశిస్తే గణనీయ ప్రమాదానికి ఆస్కారం ఉంటుందని, సెప్టెంబర్ మొదటి వారంలో భూమికి అత్యంత సమీపానికి వస్తున్న దీని ప్రయాణం మనకు సురక్షితంగానే ఉన్నట్టు నాసా తెలిపింది. మనకు అతి సమీప అంతరిక్ష వస్తువుల్లో (NEOs: near-earth objects) దీనిని ఏటెన్ (Atens) గ్రూప్‌లోనిదిగా పరిగణిస్తున్నామని, ఈ మేరకు 1862 ఏటెన్స్ ఆస్టరాయిడ్‌గానూ దీనిని వ్యవహరిస్తున్నట్టు వారు చెప్పారు. కాగా, మన భూమికి ఇప్పట్లో గ్రహశకలాల ప్రమాదమైతే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

170
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles