గో ప్రో కెమెరాలో కొత్త మోడల్


Tue,September 25, 2018 11:52 PM

అమెరికా టెక్నాలజీ కంపెనీ గో ప్రో సరికొత్తగా మార్కెట్లోకి మూడు గో ప్రో కెమెరాలను విడుదల చేసింది.
GoPro-Hero-7
నలుపు, తెలుపు, సిల్వర్ రంగులలో హీరో - 7 పేరుతో మార్కెట్లోకి విడుదలైన గో ప్రో కెమెరా ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. లైవ్ స్ట్రీమింగ్, టైమ్‌వ్రాప్ వీడియో, సూపర్‌ఫొటో, క్వాలిటీ ఆడియో, ఫేస్, స్మైల్, సీన్ డిటెక్షన్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు అమర్చి పర్యాటకులను, ఫొటో ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హైపర్‌స్మూత్ టెక్నాలజీతో రూపొందించిన ఈ గో ప్రో కెమెరాలను ఆపరేట్ చేయడం చాలా సులభం. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వీమియో లాంటి సోషల్ మీడియా యాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్ పెట్టడానికి మంచి క్వాలిటీతో వీడియోలు తీసుకునేలా ఈ కెమెరాలు రూపొందించారు.


అటోమేటిక్ హెచ్‌డీఆర్ ఐప్లె ఫీచర్‌తో మీరు తీసిన ఫొటో క్షణాల్లో హెచ్‌డీ క్వాలిటీలోకి మారిపోతుంది. మూడు రంగుల్లో విడుదల చేసిన ఈ కెమెరాలకు వాటి ఫీచర్లను బట్టి ధరలు నిర్ణయించారు. హీరో7 బ్లాక్ రూ. 36,000, హీరో7 సిల్వర్ రూ. 27, 000, హీరో7 వైట్ రూ. 19,000. నిత్యం పలు ప్రాంతాలకు, పర్యటనలకు వెళ్లే ప్రకృతి ప్రేమికులకు అక్కడి అందాలను బంధించడానికి ఈ గో ప్రో కెమెరాలు బాగా ఉపయోగపడుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కెమెరాలు మరో రెండు, మూడు రోజుల్లో మన దేశంలో మార్కెట్లోకి రానున్నాయి.

1247
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles