గొర్రెను పోలిన అల్పకా


Sat,July 28, 2018 11:46 PM

Jeevajaalam
మన ఊర్లలో ఎక్కువగా కనిపించే గొర్రెలు గుర్తున్నాయా? ఆహారం, అరుపులు, పొట్లాట విషయంలో అచ్చం వాటిని పోలిన జంతువు ఒకటి ఉన్నది. అదే అల్పకా. ఈ జంతువుకు మన పరిసరాల్లో ఉండే గొర్రెలకు చాలా దగ్గరి పోలికలున్నాయి.
అల్పకా ప్రధానంగా దక్షిణ అమెరికా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే జంతువు. ఇది అచ్చం మన ఊళ్లలో ఉండే గొర్రెను పోలి ఉంటుంది. మన దగ్గర గొర్రెల ఉన్నికి, మాంసానికి బాగా గిరాకీ ఉన్నట్లే.. చిలీ, ఈక్వెడార్, బొలీవియా, పెరూ వంటి దేశాల్లో వీటి మాంసానికి కూడా బాగా డిమాండ్ ఉన్నది. శీతల వాతావరణంలో పెరగడం వల్ల దాని రూపంలో చాలా మార్పు కనిపిస్తుంది. అక్కడి ప్రజలు దీన్ని పెంపుడు జంతువుగా, వాణిజ్య జంతువుగా పెంచుకుంటారు. వీటి ఉన్నితో స్వెటర్లు, టోపీలు, గ్లోవ్స్ వంటివి తయారు చేస్తారు. పెరూ దేశంలో పెరిగే అల్పకా జంతువుల నుంచి దాదాపు 52 రంగుల ఉన్ని లభిస్తుంది. సహజ రంగుల్లో లభించే వీటి ఉన్నికి వస్త్ర పరిశ్రమలో డిమాండ్ చాలా ఎక్కువ. అల్పకా జంతువులు 48 నుంచి 84 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవనశైలి, ఆహారం, అరుపులు అచ్చం గొర్రెల మాదిరిగానే ఉంటాయి. వీటిల్లో మగవి మన పొట్టేళ్లలాగానే పొడుస్తూ.. దాడికి దిగుతాయి. ఇంకో విషయం ఏంటంటే.. లామా, వికుగ్నా వంటి జంతువులకు వీటికి కొంచెం దగ్గరి పోలికలు ఉంటాయి. పూర్వం అక్కడి రైతులు వీటితో వ్యవసాయం చేసేవారు.

154
Tags

More News

VIRAL NEWS