గులాబీలతో అలంకరణ!


Fri,November 16, 2018 11:06 PM

గులాబీలు ప్రేమకు చిహ్నాలు. తాజాగా ఉన్నప్పుడే కాదు, ఎండిన తరువాత కూడా గులాబీలు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. గులాబీల ఉపయోగాలేంటో తెలుసుకుందాం.

rose
-గులాబీ రేకులను ఎండబెట్టాలి. చిన్న బకెట్‌లో ఎండిన రేకులు, కొన్ని షో పీసెస్ రెండింటినీ కలుపాలి. దీన్ని పక్కనున్న టేబుల్ మీద డెకరేట్ చేసుకుంటే ఇంటికి ప్రత్యేక ఆకర్షణ వస్తుంది.
-ఎండిన గులాబీ రేకులు, కొన్ని షో పీసెస్, మూలికలు, గంధం, రోజ్, కొన్ని రకాల పండ్ల తొక్కలను గ్లాస్ బౌల్స్‌లో నింపి మూత పెట్టాలి. దీన్ని ఇంట్లో షోకేష్‌లో పెట్టి డెకరేట్ చేసుకుంటే ఇల్లు కొత్తగా కనబడుతుంది.
-ఎండిన రంగు రంగుల గులాబీ రేకులను ఒక్కొక్క బౌల్లో వేసి ఇంట్లో మూలల్లో డెకరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎసెన్షియల్ ఆయిల్స్, గులాబీ రేకుల సువాసన ఇంటినిండా గుబాళిస్తుంటుంది.
-గులాబీలను గాని గులాబీ రేకులను ఫ్రేమ్ కట్టి గోడలకు హ్యాంగ్ చేయొచ్చు. డిఫరెంట్‌గా ఫ్రేమ్స్ ఉపయోగించడం వల్ల ఇల్లు మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.
-ఎండిన గులాబీ రేకులను, తాజా గులాబీ రేకులను ప్లేట్‌లో చల్లి బెడ్ పక్కన పెట్టుకోవచ్చు. దాంతో గది సువాసనతో ఆకర్షనీయంగా మారుతుంది.

931
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles