గుండెను కాపాడే వ్యాయామం


Tue,May 7, 2019 01:03 AM

ఎముకలు దృఢంగా ఉండాలని.. బరువు తగ్గాలని చాలామంది వ్యాయామం తప్పనిసరిగా చేస్తుంటారు. డాక్టర్లు కూడా ప్రతీ ఆరోగ్య సమస్యకు వ్యాయామాన్ని సూచిస్తుంటారు. అలాగే గుండెను కాపాడుకోవాలంటే వ్యాయామమే మార్గం అంటున్నారు.
Heart-Failure
హృద్రోగులు తాము తీసుకునే చికిత్సకు తోడుగా వ్యాయామం చేస్తే ఎంతో మేలు జరుగుతుందని ఇటలీ పరిశోధకులు చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ రోమ్‌కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు గుండె వైఫల్యం అయిన రోగులపై తాజాగా ఓ అధ్యయనం చేశారు. క్రమం తప్పని వ్యాయామం వల్ల గుండె వ్యాధిగ్రస్తుల్లో మానసిక ైస్థెర్యంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందట. గుండె బలంగా తయారవుతుంది. గుండె వైఫల్య అవకాశాలు తగ్గిపోతాయి. 67-71 సంవత్సరాల వయసున్న సుమారు 600 మంది పురుష వ్యాధిగ్రస్తుల గుండె తీరును ఈ సందర్భంగా పరిశీలించారు. వారిలో వ్యాయామం అనుభవం ఉన్నవారు.. వ్యాయామం తెలియనివాళ్లను వేర్వేరుగా పరిశీలించారు. వీరిలో 67% రోగులకు గుండె వైఫల్య అవకాశాలు తగ్గినట్లు వారు పేర్కొన్నారు. హార్ట్‌పేషెంట్లమని చాలామంది బెడ్‌కు పరిమితం అవుతారనీ.. అలా కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా కోలుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు.

170
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles