గింజలే అని.. గుంజి పారేయకండి!


Tue,March 5, 2019 12:59 AM

Watermelon
పుచ్చపండు మాత్రం తినేసి గింజలు పడేశారా? ఇకపై అలా చేయకండి. ఆ గింజల్లో పోషక విలువలున్నాయి. పుష్కలమైన ప్రొటీన్.. బీ కాంప్లెక్స్.. మెగ్నీషియం.. ఐరన్.. పొటాషియం.. పాస్ఫరస్.. కాపర్.. జింక్.. మాంగనీస్ వంటి అనేక పోషకాలు పుచ్చపండు గింజల్లో ఉన్నాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించడానికి ఉపయోగపడుతాయి. అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి రక్తనాళాలు పూర్తిగా తెరుచుకునేందుకు దోహదం చేస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం కార్బోహైడ్రేట్ జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి నేరుగా బ్లడ్‌షుగర్‌పై ప్రభావం చూపిస్తుంది. వీటిల్లో ఉండే ప్రొటీన్.. అమైనో ఆమ్లాలు రక్తపోటును అదుపు చేస్తాయి.

276
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles