గర్భిణులు ఇవి తినొద్దు


Tue,February 19, 2019 01:38 AM

Pregnant
గర్భంతో ఉన్న స్త్రీలు పోషకాల కోసం పలు ఆహారాలను తీసుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని రకాల ఆహారాలను తీసుకోకపోవడం కూడా అంతే ముఖ్యం. గర్భంతో ఉన్న వారు కొన్ని ఆహారాలను
తినకూడదు. అవి ఏంటంటే..


నువ్వులు

నువ్వులను తింటే గర్భం రాదు. వచ్చినా అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని తినకపోవడమే ఉత్తమం. వీటికి బదులుగా పిస్తా, వాల్ నట్స్, ఎండు ద్రాక్ష, బాదం పప్పు తింటే మేలు జరుగుతుంది.


పచ్చి బొప్పాయి

గర్భిణులు బాగా పండిన బొప్పాయి పండ్లను చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటే ఏమీ కాదు. కానీ పచ్చి బొప్పాయి పండ్లను మాత్రం తినరాదు. ఎందుకంటే వాటిల్లో ఉండే లేటెక్స్, పాలవంటి పదార్థం గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. దీంతో అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాయి పండ్లను గర్భిణీలు తినరాదు.


సోంపు, మెంతులు

వీటిల్లో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇవి గర్భాశయంపై ప్రభావం చూపిస్తాయి. అబార్షన్ అయ్యేలా చేస్తాయి. కాబట్టి వీటిని కూడా గర్భిణులు తినరాదు.


టేస్టింగ్ సాల్ట్

దీన్నే అజినోమోటో అంటారు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్, బేకరీ పదార్థాల్లో రుచి కోసం దీన్ని ఎక్కువగా వాడతారు. అయితే ఈ పదార్థం కలిసిన ఆహారాలను గర్భిణిలు తినరాదు. తింటే కడుపులో పెరుగుతున్న బిడ్డ మెదడుపై ప్రభావం పడుతుంది. కాబట్టి టేస్టింగ్ సాల్టుకు దూరంగా ఉండాలి.


వంకాయ

వంకాయలో ఫైటో హార్మోన్లు ఉంటాయి. ఇవి డైయురెటిక్ విభాగానికి చెందినవి. అయితే వంకాయలను సాధారణ స్త్రీలు తింటే రుతు క్రమం సరిగ్గా ఉంటుంది. కానీ గర్భిణిలు మాత్రం తినరాదు. ఇవి శరీరంలో వేడిని కలిగిస్తాయి. అబార్షన్‌కు దారి తీసేలా చేస్తాయి. కనుక గర్భిణిలు వంకాయలను తినరాదు.

217
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles