గర్భంలో ఫిట్స్ వస్తే..?


Wed,December 2, 2015 12:46 AM

నా వయసు 23 సంవత్సరాలు. నాకు గత పదేళ్లుగా మూర్ఛవ్యాధి ఉంది. వాల్పారిన్ అనే మందు వాడుతున్నాను. మందులు వాడితే ఫిట్స్ రావట్లేదు. అయితే ఇప్పుడు నేను మూడు నెలల గర్భవతిని. నేను మందులు వాడితే బిడ్డకు ఏమైనా ప్రమాదం ఉంటుందా?


shutterstock


మూర్ఛవ్యాధి ఉన్నవారు ఖచ్చితంగా మందులు వాడవలసిందే. అయితే ఫిట్స్ మందుల వలన కడుపులోని బిడ్డ కొన్ని లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది. ఆవిధంగా కాకుండా గర్భం రాకముందు నుంచే ఫోలేట్ అనే మందును తీసుకోవడం మంచిది. ఇది తీసుకుంటే బిడ్డలో లోపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఒకసారి గర్భం దాల్చి మూడు నెలలు గడిచిపోయాక మందు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మీకు ఇప్పటికే మూడు నెలలు నిండాయి కాబట్టి, రెగ్యులర్‌గా పొట్టకి స్కాన్ చేయించుకుని బిడ్డలో లోపాలున్నాయేమో చూసుకోండి. మీరు అదే మందును వాడవచ్చు. లేక డాక్టర్‌ను కలిసి మందు మార్చుకోవచ్చు. అయితే మరోసారి గర్భం ధరించే ముందునుంచే ఫోలేట్ విటమిన్‌ను తీసుకోండి. మందులు ఎట్టి పరిస్థితిలో ఆపవద్దు. మీకు మళ్లీ ఫిట్స్ వస్తే బిడ్డకి కూడా ప్రమాదం.

2335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles