క్యూబిక్ వీరుడు!


Sat,August 18, 2018 11:22 PM

ఒక్క నిమిషంలో మీరేం చేయగలరు? అని అడిగితే సమాధానం చెప్పడానికి కూడా ఒక్క నిమిషం పాటు ఆలోచిస్తారు కదా! కానీ.. ఈ ఫొటోలో కనిపించే కుర్రాడు ఏం చేశాడో తెలుసా?
cube
ఇప్పటి వరకు ప్రపంచంలో రూబిక్ క్యూబ్‌ని రకరకాలు పూర్తి చేసేవాళ్లు వేలమంది ఉన్నారు. ఒకరిని మించి ఒకరు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ కుర్రాడు మాత్రం వారికి కొంచెం భిన్నం. పద్దెనిమిది ఏండ్ల ఈ కుర్రాడు నిండా నీటిలో మునిగి ఒక్కసారి శ్వాస తీసుకొని నీటిలో మునకేశాడు. ఒక్క నిమిషం 44 సెకన్లు నీటిలోనే ఉండి ఆరు రూబిక్ క్యూబ్స్ సరిచేశాడు. వాకో మార్కెలాష్విలి ఈ కుర్రాడు చేసిన ఫీట్ అక్కడి వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జార్జియాకు చెందిన ఈ కుర్రాడు చేసిన ఈ అద్భుతాన్ని జార్జియన్ రికార్డ్ ఫెడరేషన్ రికార్డు చేసి గిన్నీస్ బుక్ కార్యాలయానికి పంపించింది. ఈ ఘనత సాధించడానికి ముందు ఆరు నెలల పాటు రోజులో కొన్ని గంటలు కేటాయించి ప్రాక్టీస్ చేశాడు. సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. ఇంతేకాదు.. ఈ రికార్డు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని రికార్డులు సృష్టిస్తా అంటున్నాడు.

562
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles