కోటక్ 811 అకౌంట్


Fri,August 17, 2018 11:38 PM

Kotak
జీరో బ్యాలెన్స్, అన్ని డిజిటల్ లావాదేవీలకు జీరో ఛార్జీలు, 6 శాతం వార్షిక వడ్డీతో సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం కోటక్ మహీంద్రా బ్యాంక్ 811 పేరుతో పై సదుపాయాలన్నింటితో ప్రారంభించింది. వందకు పైగా ఫీచర్లున్న ఈ అకౌంట్‌తో షాపింగ్ చేయవచ్చు, పేమెంట్లు చేయవచ్చు. 365 రోజులూ 24 గంటలూ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. దేశంలో తొలిసారిగా పేపర్‌లెస్, రియల్‌టైమ్‌లో మొబైల్ యాప్ ద్వారా ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ డౌన్‌లోడబుల్ బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్ కార్డు ఉండి 18 ఏండ్లకు పైబడిన వారెవరైనా ఓపెన్ చేయవచ్చు. అండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ను వినియోగించవచ్చు. వర్చువల్ డెబిట్ కార్డ్ ద్వారా లక్షకు పైగా ఆన్ లైన్ మర్చెంట్లకు చెల్లింపులు జరపవచ్చు. యుపీఐ ద్వారా ఈజీ మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. పీవీఆర్‌లో సినిమా టిక్కెట్లు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్, గోఐబిబోలో హోటల్స్, విమానటిక్కెట్లు, బస్‌టిక్కెట్లను బుక్ చేయవచ్చ. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డీమాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్ అకౌంట్లను కూడా యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇది బేసిక్ సేవింగ్స్‌బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కాదు. ప్రస్తుతం ఈ అకౌంట్ ను ఉపయోగిస్తున్న వారిలో 91 శాతం మంది 18-40 ఏండ్లలోపు వారే. 44 శాతం మంది వేతన జీవులుకాగా, 27 శాతం మంది స్వయం ఉపాధికలవారు. దేశంలోని 6700 పిన్‌కోడ్ ప్రాంతాలవారు ఈ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఎవరి సహాయం లేకుండా ఓపెన్ చేయవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 65 లక్షల మంది ఈ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు.

426
Tags

More News

VIRAL NEWS