కేరళకు చిన్నారుల సాయం!


Sat,August 18, 2018 11:39 PM

పిల్లలు దేవునితో సమానం అంటారు. వీరిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే, రెండేళ్ల నుంచి కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రెండు వేల రూపాయలను కేరళ బాధితులకు సహాయంగా అందించారు. ఇంత చిన్నవయసులో వీరికి సాయం చేయాలన్న ఆలోచన రావడం నిజంగా గ్రేట్!
Kids-Help
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, భారీగా వస్తున్న వరదలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. దీంతో అక్కడి ప్రజలకు సాయం చేయాలని ప్రభుత్వం కోరడంతో.. చాలామంది తమ విరాళాలను సీఎం సహాయ నిధికి పంపిస్తున్నారు. అయితే, కొచ్చికి చెందిన ఈ చిన్నారులు హారోన్, దియా తమ కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న మొత్తం డబ్బులను కేరళ వరద బాధితల కోసం విరాళంగా ఇచ్చి, తమ ఉదారతను చాటుకున్నారు. వీరి తల్లిదండ్రులు సిద్ధిఖీ మల్లాస్సెరీ, ఫాతిమా సిద్ధిఖీ. పిల్లలకు ఇచ్చిన డబ్బులను వారు వృథాగా ఖర్చు చేయకుండా కిడ్డీ బ్యాంక్‌లో రెండేళ్ల నుంచి దాచుకుంటున్నారు. ప్రస్తుతం కేరళను వరదలు ముంచెత్తడంతో వారికి సహాయం చేయాలనుకొని దాచుకున్న 2,210 రూపాయలను తల్లిదండ్రుల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపించారు. ఈ విషయాన్ని చిన్నారుల తల్లి ఫాతిమా సిద్ధిఖీ ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ఇది వైరల్ అవడంతో చిన్నారుల చేసిన మంచి పనిని పలువురు అభినందిస్తున్నారు.

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles