కుందనపు బొమ్మలకు.. కుప్పాడం పట్టు!


Fri,August 24, 2018 03:34 AM

వరలక్ష్మీ వ్రతానికి సిద్ధమైపోయారా?భక్తితో పూజలు చేయడమే కాదు.. పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా కనిపించాలి కదా! సాదాసీదా చీరలను కడితే ఏం బాగుంటుంది.. ఏ పండుగకైనా.. ఏ పెండ్లికైనా.. పట్టుదే కళంతా! ఈ అకేషన్‌లకు వార్డ్‌రోబ్‌లో పాత పట్టుచీరలు వెక్కిరిస్తున్నట్టున్నాయి.. అందుకే కుప్పాడం చీరల కలెక్షన్‌తో కుందనపు బొమ్మల్లా రెడీ అవ్వండి..
Fashan
1. కొత్తదనం కోరుకునే వాళ్లు ఈ చీరను ఎంచుకోవాల్సిందే! పింక్, బ్లూ, పర్పుల్.. ఇలా మల్టీ కలర్స్‌తో నేయించిన కుప్పాడం పట్టు చీర ఇది. చెక్స్ రూపంలో ఉన్న చీరలో జరీ ఏనుగులు కనిపిస్తాయి. బార్డర్‌లకి కూడా ఇదే డిజైన్ వచ్చింది. పల్లూలో మాత్రం నెమళ్లు నాట్యమాడుతాయి.

2. సింపుల్ అండ్ స్వీట్‌గా కనిపించేందుకు ఈ చీర చుట్టాల్సిందే! బ్లూ కలర్ చెక్స్ వచ్చాయి. మధ్య మధ్యలో పువ్వుల డిజైన్ చీర అందాన్ని పెంచాయి. జరీ, ఆకుపచ్చని బార్డర్‌లతో ఈ కుప్పాడం చీర మెరిసిపోతున్నది. కొంగుకి హెవీ జరీ పువ్వుల డిజైన్ వచ్చింది.
Fashan1
3. కుప్పాడం పట్టులో పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌లాగా ఉందీ చీర. ఆరెంజ్ కలర్ చెక్స్ చీరకి బ్లూ కలర్ జరీ బార్డర్‌లను జతచేశాం. ఈ జరీ బార్డర్‌లు కూడా ఒకవైపు చిన్నగా, మరోవైపు పెద్దగా నేయించాం. హెవీ పల్లూ చీర అందాన్ని రెట్టింపు చేసింది.

4. చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ చీర కుప్పాడం పట్టు. యెల్లో, బ్లూ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చీరకి ఒక వైపు చిన్న బార్డర్, మరో వైపు పెద్ద బార్డర్ నేయించాం. పెద్ద బార్డర్ మీద నెమళ్ల డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది. చెక్స్‌తో వచ్చిన కొంగు దీనికి అదనపు ఆకర్షణ.

కామాక్షి మహంకాళి
ఫౌండర్/చైర్మన్
www.vynam.com
లార్జెస్ట్ సిల్క్
అండ్
హ్యాండ్‌లూమ్ కలెక్షన్స్
ఫోన్ : 8296848484
9000564333

5791
Tags

More News

VIRAL NEWS