కుండనీళ్లే మేలు!


Thu,May 24, 2018 01:44 AM

సూర్యుడు తన ఎండవేడితో జనాలను అల్లాడించేస్తున్నాడు. ఒకవైపు ఎండతాపం, మరోవైపు గొంతెండిపోయే దాహం. ఈ రెండింటినీ తట్టుకోవడానికి చల్లని పానీయాలు వెతుక్కుంటాం. కానీ మట్టితో తయారుచేసిన కుండ నీళ్లే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు.
pot
ఈ రోజుల్లో చాలామంది ఇండ్లలో ఫ్రిజ్‌లున్నాయి. దాహమేస్తే చాలు ఫ్రిజ్ డోరు ఓపెన్ చేసి చల్లని నీళ్లు గుటకలు వేస్తూ తాగేస్తుంటారు. తాత్కాలికంగా ఫ్రిజ్ వాటర్ దాహాన్ని తీర్చినా దీర్ఘకాలికంగా ఆ నీటివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందనేది వాస్తవం. అయితే ఎండాకాలంలో చల్లటి నీటితో గొంతు తడుపుతూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే కుండనీళ్లే తాగమంటున్నారు నిపుణులు. మనం తాగే నీళ్లు కుండలో పోసి తాగడం వల్ల నీటిలో ఉండే మలినాలను కుండ పీల్చుకుటుంది. దీంతో నీళ్లు ప్రత్యేకంగా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటే కుండ మట్టితో చేయడం వల్ల మట్టిలో ఉండే ఔషధ గుణాలన్నీ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరానికి కావాల్సిన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటి ద్వారా లభిస్తాయి. కుండలో పోసిన నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లతో పోరాటం చేయడానికి శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. ఎండాకాలంలో శరీరంలో పెరిగే ఆమ్లత్వాన్ని కూడా కుండనీళ్లు తగ్గిస్తాయి. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మట్టికుండలో ఉంచిన నీళ్లు తాగితే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల వచ్చే జలుబు, దగ్గు లాంటి సమస్యలు కుండనీళ్లు తాగడం వల్ల రావు.

1332
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles